మోదీ పై రాహుల్ గాంధీ "నోబెల్ బుల్లెట్"...

Published: Monday March 19, 2018

న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందంటూ ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా... ప్రధాని మాత్రం ‘‘అచ్చే దిన్’’ అంటూ బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. నోబెల్ బహుమతి పొందిన ఆర్ధికవేత్త పాల్ క్రుగ్మాన్ ఇటీవల à°“ మీడియా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాహుల్ à°ˆ మేరకు ట్విటర్లో స్పందిచారు.
 
‘‘ఇప్పటికి రెండేళ్లుగా మేము చెబుతున్న విషయాలనే నోబెల్ విజేత పాల్ క్రుగ్మాన్ ధ్రువీకరించారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు నిరుద్యోగమే. కాని ప్రధానమంత్రి à°ˆ విషయాన్ని గ్రహించకపోవడం మన దురదృష్టం. ఆయన ‘‘అచ్చేదిన్’’కు ఎక్కడ దెబ్బతగులుతుందన్న భయంతోనే ప్రధాని à°ˆ వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు..’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా తయారీ రంగంలో అభివృద్ధి చెందకపోతే భారత్ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇటీవల ఆర్ధికవేత్త క్రుగ్మాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.