108 అంబులెన్సుల సిబ్బందితో సీఎం జగన్‌ చర్చలు

Published: Friday July 26, 2019
సమ్మెలో ఉన్న 108 అంబులెన్సుల సిబ్బందితో సీఎం జగన్‌ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన à°ˆ చర్చల్లో... ‘నాన్న పెట్టిన 108 అంబులెన్సుల పథకానికి మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యోగ భద్రత విషయంలో 108 సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదు’ అని భరోసా ఇచ్చారు. వారి డిమాండ్లన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డిని అక్కడికక్కడే ఆదేశించారు.
 
దీంతో, గురువారం రాత్రి నుంచి 108 సిబ్బంది విధుల్లో చేరారు. à°ˆ చర్చల్లో పలు అంశాలను ఉద్యోగులు ప్రస్తావించారు. తమకు ప్రతినెలా జీతాలు ఇవ్వడం లేదని, తమ ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితిల్లో ఉన్నామని ఉద్యోగులు చెప్పారు. ప్రతి ఉద్యోగికీ జీవీకే, బీవీసీ సంస్థల నుంచి సుమారు లక్ష రూపాయిల వరకూ బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. తాము రోజుకు 12 గంటలు ఉద్యోగంలోనే ఉంటున్నామని, తమకు కూడా 8 à°—à°‚à°Ÿà°² పని విధానాన్ని అమలు చేయాలని విన్నవించారు. à°ˆ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ... 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తమ సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించడంతో, ఉద్యోగులు సమ్మె విరమించారు.