నేడు లోక్‌సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు...

Published: Monday March 19, 2018

దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం లోక్‌సభ ముందుకు రానున్నాయి. à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఇచ్చిన తీర్మానాలు à°šà°°à±à°šà°•à± రాకుండానే మురిగిపోవడంతో తెదేపా, వైకాపాలు సోమవారం మరో ప్రయత్నం చేయనున్నాయి. అన్నాడీఎంకే, తెరాసలు వెల్‌లో నిల్చొని ఆందోళన చేస్తున్న కారణంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే 50 మందిని లెక్కించడం సాధ్యం కాలేదంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం సభను వాయిదా వేశారు. à°† వెంటనే సోమవారం చర్చ కోసం రెండు పార్టీలూ అదే రోజు మధ్యాహ్నం స్పీకర్‌ సచివాలయంలో మళ్లీ నోటీసులు అందజేశాయి. వాటిని సోమవారం మధ్యాహ్నం స్పీకర్‌ మరోసారి సభ ముందుంచే అవకాశం ఉంది.

సోమవారం సభ à°¸à°œà°¾à°µà±à°—à°¾ ఉంటే అవిశ్వాస తీర్మనాలకు à°®à°¦à±à°¦à°¤à°¿à°šà±à°šà±‡ వారిని లేచి నిల్చోమని స్పీకర్‌ à°¸à±‚చిస్తారు. మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 10% మంది మద్దతిస్తున్నట్లు స్పీకర్‌ నిర్ణయించుకుంటే అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించి చర్చ షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు. శుక్రవారం నాటి పరిస్థితులే పునరావృతమైతే అవిశ్వాస తీర్మాన నోటీసులను తిరస్కరించి, సభను వాయిదా వేస్తారు. ఇక ప్రభుత్వ వ్యవహారాలేమీ లేవని భావనకు వస్తే నిరవధిక వాయిదా వేయడానికీ అవకాశం ఉంది. సభ సాగడమా? లేదా? అన్నది ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుంది.

విశ్వాసం.. అవిశ్వాసం..: à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు ఉభయసభలు వేర్వేరుగా సభా నిర్వహణ నిబంధనలు రూపొందించుకోవడానికి రాజ్యాంగంలోని 118à°µ అధికరణ అనుమతిస్తోంది. దాని ప్రకారం లోక్‌సభ 198à°µ నిబంధన.. అవిశ్వాస తీర్మాన ప్రక్రియ గురించి చెబుతోంది. దాని ప్రకారం సభలోని ఏ సభ్యుడైనా కేంద్ర మంత్రివర్గానికి వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వొచ్చు. ఇలాంటి అవిశ్వాస తీర్మానం కారణంగా గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఓటమి చవిచూసింది. సభలో తనకు మెజార్టీ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి వచ్చినప్పుడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. అవిశ్వాస తీర్మానం తరహాలో విశ్వాస తీర్మానానికి సంబంధించి విస్పష్ట నిబంధనలు లేవు. 184à°µ నిబంధన à°•à°¿à°‚à°¦ సాధారణ తీర్మానం తరహాలో దాన్ని ప్రతిపాదిస్తారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమయ్యాక ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రావడంలేదు. మెజార్టీ సభ్యుల మద్దతున్న కూటమికి నేతృత్వం వహించే వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం, బాధ్యతలు చేపట్టాక ఆయన మెజార్టీ నిరూపించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1998లో మెజార్టీ ఎంపీలు లేఖలు ఇవ్వడంతో అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌.. వాజ్‌పేయిని ప్రధానిగా నియమించారు. పదిరోజుల్లోపు సభ విశ్వాసం పొందాలని సూచించారు.