రష్యా అధ్యక్షుడిగా.. పుతిన్‌కే పట్టం

Published: Monday March 19, 2018

మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్‌ పుతిన్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 76.67శాతం ఓట్లు పడినట్లు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికారికంగా వెల్లడించింది. దీంతో మరో ఆరేళ్ల పాటు అంటే 2024 వరకూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. పుతిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాలుగోసారి.

రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. à°ˆ ఎన్నికల్లో 99.8శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పుతిన్‌తో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు  బరిలోకి దిగారు. అయితే న్యాయపరమైన కారణాలతో పుతిన్‌ ప్రధాన అభ్యర్థి అలెక్సీ నావల్నీ బరిలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పుతిన్‌ ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది. 19ఏళ్ల క్రితం 1999లో పుతిన్‌ తొలిసారిగా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. à°¸à±‹à°µà°¿à°¯à±†à°Ÿà±‌ నియంత జోసఫ్‌ స్టాలిన్ తర్వాత రష్యాను సుదీర్ఘ కాలం à°ªà°¾à°²à°¿à°‚à°šà°¿à°¨ నేత పుతిన్‌ కావడం విశేషం.