వార్డు’ పరీక్షల తేదీలు ఖరారు

Published: Saturday August 03, 2019

పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సచివాలయాల్లోని పోస్టుల కోసం పరీక్షల తేదీలను పురపాలక శాఖాధికారులు ఖరారు చేశారు. à°’à°•à°Ÿà°¿ కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పరీక్షలను రాసే అవకాశం కోల్పోకుండా సెప్టెంబరు 1, 8à°µ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించనున్నారు. అంతేకాదు... తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యనభ్యసించిన అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను à°† రెండు భాషల్లోనూ నిర్వహించనున్నట్లు డీఎంఏ(పురపాలక శాఖ) కమిషనర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం... వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ, మహిళలు మరియు బలహీనవర్గాల ప్రొటెక్షన్‌ సెక్రటరీ పోస్టులకు; అదేరోజు మధ్యాహ్నం... వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2), హెల్త్‌ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ ఉద్యోగాలకు రాత పరీక్ష జరుగుతుంది. అదే నెల 8à°µ తేదీ ఉదయం... వార్డు ప్లానింగ్‌ మరియు రెగ్యులేషన్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2), శానిటేషన్‌ మరియు ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2), వెల్ఫేర్‌ మరియు డెవల్‌పమెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2) పోస్టులకు; అదేరోజు మధ్యాహ్నం... వార్డు ఎడ్యుకేషన్‌ మరియు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజులను కంప్యూటర్‌ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొబైల్‌ యాప్‌à°² ద్వారా చెల్లించినట్లయితే, à°† మొత్తం వారి బ్యాంక్‌ఖాతాల నుంచి డెబిట్‌ అయినా దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా నింపుతున్నప్పుడు ‘ఫీజ్‌ నాట్‌ పెయిడ్‌’ అని వస్తోంది. దరఖాస్తుల్లో సమాచారాన్ని తప్పుగా నమోదు చేసినట్లయితే వాటిని ‘ఓటీపీఆర్‌’ ద్వారా సవరించుకునే అవకాశం కూడా కల్పించారు. దరఖాస్తుకు à°ˆ నెల 10à°µ తేదీ వరకూ గడువుంది.