బ్రిటానియా బిస్కట్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

Published: Saturday August 03, 2019
కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్స్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 2.30 à°—à°‚à°Ÿà°² సమయం బిస్కెట్స్ లోడ్‌తో వచ్చిన లారీ డ్రైవర్.. వైర్లు కాలుతున్న వాసన రావడంతో వాచమేన్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే వాచ్‌మేన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
 
 
గన్నవరం, ఉయ్యురు, పటమటలకు చెందిన ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. ఘటనపై కంకిపాడు ఎస్సై శాతకర్ణి వివరాలు సేకరిస్తున్నారు. సుమారు 3.5 ఎకరాల్లో బ్రిటానియా బిస్కట్ గోడౌన్ విస్తరించి ఉంది. దీనిని à°ˆ ఏడాది జూన్‌లో ప్రారంభించారు. à°ˆ గోడౌన్ నిర్మాణ వ్యయం సుమారు రూ.3 కోట్లు కాగా దీనిలో దాదాపు కోటి రూపాయల సరకును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.