6న ప్రధానమంత్రిని కలుస్తాం : ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Published: Tuesday January 02, 2018

రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా à°ˆ నెల 6à°¨ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తామని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు.తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులపై ప్రధానిని కలిసి నిధుల మంజూరుకు ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. కొత్త సంవత్సరంలో పెండింగ్‌ అంశాలు, విభజన హామీలు, రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణ విషయమై ప్రధానితో చర్చిస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనకాపల్లి-ఆనందపురం రోడ్డు విస్తరణ, విశాఖ రైల్వే జోన్‌, తుని-కొత్తవలస వయా నర్సీపట్నం రైల్వే లైన్‌ సర్వేపై ప్రస్తావించడం జరిగిందన్నారు.

డ్రైడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థను ప్రైవేటుపరం కానివ్వకుండా చూడాలని కోరినట్టు చెప్పారు.జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందించే దిశగా ముఖ్యమంత్రి à°ˆ కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు.à°ˆ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు తాకాశి ఉమామహేశ్వరరావు, గుత్తా ప్రభాకర్‌చౌదరి, తాడి రామకృష్ణ ఉన్నారు.