పోలవరం పనులపై కేంద్రమంత్రి ....

Published: Tuesday March 20, 2018


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ చెప్పారు. సిమెంట్‌, స్టీలు, ఇంధనం, కూలీలు, యంత్రాలు, ఇతర ఉపకరణాలకు మూడేళ్లలో రూ. 331.35కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచందర్‌రావు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
 

à°ˆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కూలీలు, యంత్రాలు, ఇతర ఉపకరణాల విషయంలో 2013 ఏప్రిల్‌ 1నుంచి రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిందని, అందుకు వీలుగా రెండు జీవోలు జారీ చేసిందని చెప్పారు. పనులను 22 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరు ఏజెన్సీలకు అప్పజెప్పారని తెలిపారు.వారికి ఒప్పందం ప్రకారం కుదిరిన రేట్లు, ఈపీసీ కాంట్రాక్టు షరతుల ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని, అయితే పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు