రిజిస్ర్టేషన్లలో మందగమనం

Published: Monday August 12, 2019
రిజిస్ర్టేషన్ల ఆదాయంలో గుంటూరు జిల్లా తొలినుంచీ మొదటి వరసలోనే ఉంది. à°—à°¤ ఏడాది à°ˆ సమయానికి వందశాతం డాక్యుమెంట్లు నమోదుచేసి, రికార్డు సృష్టించింది. అలాంటిది ఇప్పుడు అక్కడ రిజిస్ర్టేషన్ల సంఖ్య బాగా తగ్గింది. à°—à°¤ నాలుగు నెలల్లో అటు ఆదాయమూ, ఇటు డాక్యుమెంట్ల సంఖ్య కూడా పడిపోయాయి. లక్ష్యానికి చాలా దూరంగా కేవలం 74 శాతం మాత్రమే ఆదాయం ఆర్జించిన జిల్లాగా మిగిలింది. అయితే, ఇది ఒక్క à°† జిల్లా పరిస్థితే కాదు. రాష్ట్రమంతా రిజిస్ర్టేషన్లలో ఎక్కడా ఊపు కనిపించడం లేదు. రిజిస్ర్టేషన్ల ద్వారా రూ. ఆరు వేల కోట్లపైనా రాబట్టాలని రాష్ట్ర బడ్జెట్‌లో లక్ష్యం నిర్దేశించుకొన్న తరుణంతో, ఆదాయ సముపార్జనలో ఇంతటి మందగమనం అధికారవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కొంత నెమ్మదించడం రిజిస్ర్టేషన్ల ఆదాయంపై బలంగా పనిచేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై...à°ˆ నాలుగు నెలల కాలానికి లక్ష్యానికి దూరంగానే à°ˆ ఆదాయం ఉంది. à°—à°¤ ఏడాదితో పోలిస్తే à°ˆ ఏడాది రిజిస్ర్టేషన్‌ అయిన డాక్యుమెంట్ల సంఖ్య తగ్గింది. à°—à°¤ ఏడాది ఏప్రిల్‌-మే-జూన్‌-జూలై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5.99లక్షల డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌ అయ్యాయి.
 
వాస్తవానికి à°ˆ డాక్యుమెంట్లు సంఖ్య ఏటేటా పెరుగుతుంది. కానీ à°ˆ ఏడాది మాత్రం అవే నాలుగు నెలలకు పోలిస్తే బాగా తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌-జూలై మధ్య నాలుగునెలల్లోను రిజిస్టరయిన డాక్యుమెంట్ల సంఖ్య 5.80లక్షలుగా మాత్రమే ఉంది. పోలింగ్‌ అనంతరం రియల్‌ఎస్టేట్‌లో కాస్త స్తబ్ధత నెలకొనడం, ఫలితాల అనంతరం కూడా à°† అనిశ్చితి కొనసాగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. 2018-19ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్ల శాఖ సుమా రు రూ.4,600కోట్ల ఆదా యం సమకూర్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని à°ˆ ఏడాది బడ్జెట్‌లో రూ.6,600కోట్లు ఆదాయ లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలి నాలుగు నెలల కాలానికి రూ.2,211కోట్లు ఆదాయ లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే అందులో రూ.1733కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. లక్ష్యంలో ఇది 78శాతం! à°ˆ మాత్రం ఆదాయం రావడానికి కూడా రిజిస్ర్టేషన్‌ ధరల పెంపు à°’à°• కారణం. ఆగస్టు ఒకటో తేదీనుంచి రిజిస్ర్టేషన్ల ధరలు పెరుగుతాయని ముందే చెప్పడంతో, రిజిస్ర్టేషన్‌దారులు కొంత తొందరపడ్డారు. పట్టణప్రాంతాల్లో ఐదుశాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10శాతం పెంచడంతో...à°† పెంపుకంటే ముందుగానే రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని అనుకున్నారు. దీంతో జూలై చివరి నాలుగు రోజుల్లో విపరీతంగా రిజిస్ర్టేషన్లు à°… య్యాయి. దీంతో à°† ఒక్క నెలలోనే రూ.693కోట్ల à°† దాయం సమకూరింది. దీంతో à°ˆ నాలుగు నెలల à°•à°¾ లంలో అనుకున్న లక్ష్యంలో à°† మాత్రమైనా ఆదాయం à°µ చ్చిందని అంటున్నారు.
 
అయితే à°—à°¤ ఏడాది ఇదే 4 నెలల కాలంతో పోలిస్తే మాత్రం ఆదాయం రూ.108 కోట్లు పెరిగింది. à°—à°¤ ఏడాది ఏప్రిల్‌-జూలైల కాలంలో రూ.1625కోట్లు రాగా, à°ˆ ఏడాది అదేకాలానికి రూ.1733కోట్లు వచ్చింది. ఇది సుమారు 6.5శాతం ఎక్కువ. అయితే ప్రభుత్వం మాత్రం సుమారు à°—à°¤ ఏడాదికంటే సుమారు 40శాతం ఆదాయం అధికంగా సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం! శ్రీకాకుళం జిల్లా రిజిస్ర్టేషన్ల ఆదాయ లక్ష్యం చేరుకోవడంలో మిగతా జిల్లాల కన్నా ముందు నిలిచింది. à°† జిల్లాకు నిర్ణయించిన లక్ష్యంలో 97శాతం సాధించింది. కర్నూలు జిల్లాలో 82శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 80శాతం మేర లక్ష్యం చేరుకొన్నారు.