దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు

Published: Thursday August 22, 2019
బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మను బదిలీచేసి.. ఆమె స్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌వి.సురేష్‌బాబును నియమించేందుకు ప్రభుత్వం à°°à°‚à°—à°‚ సిద్ధంచేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే కోటేశ్వరమ్మను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో సురేష్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది. ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను ఇక్కడి నుంచి బదిలీచేసినప్పటికీ ఆమెకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముంబైలో ఆదాయపన్నుశాఖ అధికారిగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ డిప్యుటేషన్‌పై గతేడాది రాష్ట్రానికి వచ్చారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆమెను దుర్గగుడి ఈవోగా నియమించింది. కోటేశ్వరమ్మ దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టి à°—à°¤ శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. à°—à°¤ ఏడాది దసరా ఉత్సవాలకు నెల రోజుల ముందు దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరమ్మను à°ˆ ఏడాది దసరా ఉత్సవాలు ప్రారంభం కావడానికి నెల రోజుల ముందుగానే ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం! దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను తక్షణమే బదిలీ చేయాలంటూ జిల్లాకు చెందిన ఒకమంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం వల్లే ప్రభుత్వం ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 
దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఏడాది కాలమే పనిచేసినా ఇంద్రకీలాద్రిపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె ఈవోగా బాధ్యతలు చేపట్టేనాటికి గుడిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఆషాడ మాసంలో దుర్గమ్మకు భక్తులు సమర్పించిన ఖరీదైన చీర మాయం కావడంతో దానిపై వివాదం నెలకొంది. ఆ నేపథ్యంలో అప్పుడే ఈవోగా ఉన్న ఎం.పద్మను బదిలీ చేసి.. ఆమె స్థానంలో కోటేశ్వరమ్మను అప్పటి ప్రభుత్వం నియమించింది. కోటేశ్వరమ్మ ఈవోగా బాధ్యతలు చేపట్టడానికి ముందు దేవస్థానం ఆర్థికపరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇంద్రకీలాద్రిపై భక్తులకు సౌకర్యాల మాట పక్కనపెడితే గుడిలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టతరమైన పరిస్థితి ఉండేది. ఈవోగా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరమ్మ అనతికాలంలోనే కొండపై పరిస్థితులను అవగాహన చేసుకుని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి ఒకే సీటులో పాతుకుపోయిన ఉద్యోగులను అంతర్గత బదిలీలుచేసి దేవస్థానంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనావ్యవస్థను చాలావరకు గాడిన పెట్టగలిగారు. తర్వాత భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చడంపై దృష్టిసారించారు.
 
ఈవో కోటేశ్వరమ్మ రావడానికి ముందు ఇంద్రకీలాద్రి కొండపై నిలువ నీడ కూడా ఉండేది కాదు. కోటేశ్వరమ్మ చొరవ తీసుకుని దాతలను ప్రోత్సహిస్తూ.. వారి సహకారంతో కొండపైన, దిగువన శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటుచేయించారు. కొండపై చిన్నరాజగోపురం ముందు నుంచి ఘాట్‌రోడ్డును కవర్‌ చేస్తూ ముగ్గురు దాతలు షెడ్లు ఏర్పాటుచేశారు. కొండ దిగువన మహామండపం ముందు మరో దాత భారీషెడ్డును, మరోదాత మహామండపానికి దక్షిణం వైపున మరో షెడ్డును నిర్మించారు. à°† షెడ్లు ఇప్పుడు భక్తులకు సౌకర్యంగా మారాయి. తర్వాత దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ఈవో కోటేశ్వరమ్మ à°† తర్వాత దేవస్థానానికి ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు. భక్తులు సమర్పించిన విరాళాలతో దాదాపు రూ. 40 కోట్ల వరకు అమ్మవారి పేరుతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. మరో రూ. 10 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారు.