పీవీ సింధు అద్భుత విజయం వెనుక కిమ్

Published: Tuesday August 27, 2019
ఒక్కసారిగా సింధులో ఎంతమార్పు. ఆరు నెలల టైటిల్‌ కొరతను ఏకంగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకంతో తీర్చుకునే స్థాయిలో ఆమె ఆట మారిపోయింది. రెండేళ్ల కిందట నొజొమి ఒకుహరతో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు ప్రదర్శనకు..ఆదివారం అదే నొజొమితో అంతిమ సమరంలో భారత స్టార్‌ ఆటకు పోలికే లేదు. 2017 ఫైనల్లోనూ సింధు అద్భుతంగా ఆడింది. కానీ అప్పుడు ఒత్తిడికిలోనై కీలక సమయాల్లో షాట్ల ఎంపికలో తొట్రుపాటుకు లోనైంది. కానీ ఈసారి సింధు అందుకు భిన్నమైన ప్రదర్శన చేసింది. ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఆమెపై ఎదురు దాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్‌ షట్లర్లు సిద్ధహస్తులు. అందునా నొజొమికి ర్యాలీలలో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను బాడీ స్మాష్‌లతో తిప్పికొట్టిన సింధు.. ఒకుహరను డిఫెన్స్‌లో పడేసింది. నెట్‌ గేమ్‌తో, స్మాష్‌లతో ఒకుహరను కోర్టు నలుమూలలా పరుగులు పెట్టించింది. సింధు ఆటతీరు ఇంత అద్భుతంగా మారడానికి కారణం.. కొత్త కోచ్‌ కిమ్‌ జి హ్యున్‌. అందుకే మ్యాచ్‌ అనంతరం సింధు.. కిమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. వర్ధమాన షట్లర్లను తీర్చిదిద్దాల్సి ఉండడంతో కొంతకాలం కిందట సింధు, సైనా కోచింగ్‌ బాధ్యతలనుంచి గోపీచంద్‌ వైదొలిగాడు.
 
దాంతో à°—à°¤ ఏప్రిల్‌లో సింధు కోచ్‌ బాధ్యతలను కిమ్‌ చేపట్టింది. అనతికాలంలోనే సింధు ఆటతీరును ఆమె సమూలంగా మార్చివేసింది. ముఖ్యంగా నెట్‌ గేమ్‌లో సింధును తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దింది. అలాగే 100 శాతం ప్రదర్శన చేసేలా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఒకుహరనేకాదు తనకు కొరకరాని కొయ్యగా మారిన మరో జపాన్‌ అమ్మాయి అకానె యమగూచికి కూడా సింధు చెక్‌పట్టే స్థాయికి చేరింది. ఇక.. ఒకుహరతో ఆదివారంనాటి ఫైనల్‌కు ముందు సింధుతో కిమ్‌ ప్రత్యేకంగా భేటీ అయింది. షాట్ల విషయమై ఆమెతో à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండుమార్లు చర్చించింది. ఆరంభంనుంచే విరుచుకుపడి ఒకుహరను ఆత్మరక్షణలో పడేయాలని సూచించింది. వాటిని తు.à°š. పాటించిన సింధు అమోఘమైన ఫలితం రాబట్టింది.