విద్యార్థులను బూటుకాళ్లతో తన్నిస్తారా?

Published: Thursday August 29, 2019

‘ఇన్నాళ్లు మీ ఇంటిదగ్గరే 144సెక్షన్‌ అనుకున్నాం. కానీ రాష్ట్రమంతా అమలు చేస్తున్నారుగా! వరదలొచ్చి ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో మీరు అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. ఇప్పుడు విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిలు ఇవ్వాలంటే... వారిని పోలీసుల బూటుకాళ్లతో తన్నిస్తారా? విద్యార్థుల డిమాండ్లను తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నాం. వారికి న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘మేం మీకు అన్యాయం చేస్తాం కానీ మీరు మాత్రం ఆందోళన చేయకూడదన్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా చూస్తున్నాం. ఆశా కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ల కుటుంబసభ్యుల్ని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి బెదిరిస్తారా? ఇప్పుడు విద్యార్థుల పట్ల ఇలా కర్కశంగా వ్యవహరిస్తారా?’ అని లోకేశ్‌ ట్విటర్‌లో బుధవారం విమర్శించారు