ఈసారి జోరు పెంచిన జనసేన

Published: Sunday April 29, 2018

2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీకి జనసేన సై అంటోంది. 60 నుంచి 65 స్థానాలకే పరిమితమన్న ప్రచారంలో వాస్తవం లేదంటోన్న ఆపార్టీ నేతలు.. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం అంటూ తొడగొడుతున్నారు. విమర్శలు, కుట్రలను లేక్కచేయబోమంటోన్న ఆ పార్టీ నేతలు.. మరో 20రోజుల్లో జనసేన పార్టీలో సమగ్రమైన మార్పులు కనిపిస్తాయంటున్నారు. మరోవైపు .. జనసేనకు, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది.. మరీ ముఖ్యంగా గల్లా జయదేవ్ పవన్ పై చేస్తున్న విమర్శలకు.. జనసేన నుంచి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య నడుస్తోన్న ట్వీట్ వార్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది.


 

2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన పూర్తిస్థాయిలో సన్నద్ధమౌతోంది. పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం లేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలు పోటీచేయడం డౌటే అంటూ వస్తున్న వార్తలను ఆపార్టీ తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన పోటీచేస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి అద్దే పల్లి శ్రీధర్ ఢంకా స్పష్టం చేశారు.. పవన్ కల్యాణ్ ఇకపై ప్రజల్లోనే ఉండబోతున్నారని.. సొంత సెక్యూరిటీతోనే ప్రజలమధ్యకు వస్తున్నారని చెప్పారు. అంతేకాదు జనసేన పార్టీలోకి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పిన అద్దేపల్లి శ్రీధర్.. సీనియర్ రాజకీయ నేతల్లోనూ మంచివాళ్లకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అధికార పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు.

జనసేన వర్సెస్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నట్టుగా ఏపీలో సరికొత్త వార్ మొదలయ్యింది. జయదేవ్ పెట్టిన ట్వీట్‌తో మొదలైన యుద్ధం మరింత వేడెక్కింది. ఎంపీ చేసిన ట్వీట్, విమర్శలకు జనసేన నుంచి కౌంటర్ రాగా... గల్లా నుంచి అదే రేంజ్‌లో స్పందన వస్తోంది. 4 ఏళ్ల నుంచి 100 సార్లు స్పీచ్ ఇచ్చాను.. అంటే సెంచరీ కొట్టేశా... ప్రత్యేక హోదా కోసం మేము కేంద్రం, ప్రధానిపై పోరాడుతూనే ఉన్నాం. మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ గల్లా జయదేవ్ చేసిన ట్వీట్ కు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్క రోజు లోక్‌సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. అంటూ విమర్శిస్తున్నారు. కొత్త సినిమా, à°•à°¥, డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాష్టారంటూ ట్వీట్ లతో వార్ కొనసాగిస్తున్నారు..ఫేస్ బుక్ , ట్విట్టర్ లో à°ˆ వార్ పెద్ద ఎత్తున సాగుతోంది. జనసేన ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటే.. కుట్రలుచేస్తున్న తెలుగుదేశం పార్టీ.. రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని మండిపడుతున్న జనసేనపార్టీ.. కుట్రలను లెక్యచేయబోమంటున్నారు.