ప్రస్తుతం రూ.270లు ఉన్న సిమెంట్ బస్తా..

Published: Thursday September 05, 2019
సిమెంటు ధరలు పెరగనున్నాయి... చవితికి ముందు డిస్పాచ్‌ హాలిడేస్‌ పేరుతో సిమెంటు ఉత్పత్తిని నిలిపివేసిన కంపెనీలు...మరలా తెరుచుకున్న వెంటనే సిమెంటు ధరలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఇన్వాయిస్‌ ధరలను కంపెనీలు ప్రకటించాయి. ఓపీసీ సిమెంట్‌ బస్తా రూ.330లు, పీపీసీ సిమెంటు బస్తా రూ. 318లుగా ధరలు నిర్ణయించారు. డిస్కౌంట్‌ ప్రకటనకై డీలర్లు ఎదురుచూస్తున్నారు. కాగా మొన్నటి వరకూ సిమెంటు ధరలు తిరోగమనంలో ఉండడంతో వినియోగదారులు తక్కువ ధరలకే కొనుగోలు చేసి నిల్వ చేశారు. బస్తా ధర రూ.250à°² నుంచి రూ.260à°² మధ్యలో లభించడంతో బిల్డర్లు, వ్యక్తిగత భవన నిర్మాణ దారులు అవసరానికి మించి కొనుగోలు చేశారు. ఇప్పుడు సిమెంటు కంపెనీలు ధరలు పెంచినా పెద్దగా అమ్మకాలు ఉండవని సిమెంటు రిటైల్‌ వర్తకులు పేర్కొంటున్నారు.
 
 
సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన పాలసీని ప్రకటించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ సామాగ్రి ధరలు దిగివచ్చాయి. ఎన్నికలకు ముందు బస్తా సిమెంటు ధర రూ.360కు చేరగా, రెండు రోజులకు ముందు బస్తా రూ.250లకే లభించింది. పాత ప్రభుత్వంలో ధరలను అదుపుచేయడంలో నియంత్రణ మండలి విఫలమైందని, పరోక్షంగా ప్రభుత్వ పెద్దలే సిమెంటు ధరల పెరుగుదలకు కారణమనే ఆరోపణలు వినిపించాయి. అనంతరం ఇసుకకు కృత్రిమ కొరత రావడంతో సిమెంట్‌ ధరలు దిగివచ్చాయి. అయితే ఇసుక లేకపోవడంతో ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం జె టాక్స్‌ పేరుతో వసూలు మొదలు పెట్టారని ప్రతిపక్షాలు తాజాగా విమర్శలు చేశాయి. à°ˆ పరిస్థితుల్లో సిమెంటు కంపెనీలు ధరలు పెరుగుదలకు తెరతీసినట్టు సమాచారం.నూతన పాలసీ ద్వారా వినియోగదారులకు కావాల్సిన మేరకు ఇసుక అందే అవకాశాలు ఉండడం.. అదే సమయంలో సిమెంటు ధరలు పెరగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
 
సిమెంట్‌ కంపెనీలు ప్రకటించిన ఇన్వాయిస్‌ ధరపై డీలర్లకు డిస్కౌంట్‌ ఇస్తాయి. డిస్కౌంట్‌ పలు రూపాల్లో ఉంటుంది. ఇన్వాయిస్‌-డిస్కౌంట్‌ ధరల వ్యత్యాసం ఆధారంగా డీలర్లు, రిటైల్‌ వర్తకులు అమ్మకాలు సాగిస్తారు. సిమెంట్‌ కంపెనీలు తమ వ్యాపార అనుభవం మేరకు డిస్కౌంట్‌ ఇస్తూ ఉంటాయి. పేరెన్నిక గన్న కంపెనీలు తక్కువ డిస్కౌంట్‌ ఇస్తే, మార్కెట్లో పోటీని ఎదుర్కొనే కంపెనీలు అధిక డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తాయి.