మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

Published: Saturday September 07, 2019
ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నింపి భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి వచ్చిన చంద్రబాబు తన రెండు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించారు. సీఎం హోదాలో తలమునకలై పార్టీ క్యాడర్‌కు ఇన్నాళ్లు దూరం కాగా, ఇప్పుడు వారికి పూర్తి సమయం కేటాయించారు. ప్రతి ఒక్కరితో మమేకమయ్యారు. ఓటమికి కారణాలు, పార్టీలో లోటుపాట్లు, బలోపేతం కావడానికి చేపట్టాల్సిన దిద్దుబాట్లపై 19 నియోజకవర్గాల నేతలతో à°ˆ రెండు రోజులు కూలంకుషంగా చర్చించారు.
 
అటు నేతలు, కార్యకర్తలు సైతం బాబు ఎదుట తమ మనోభిప్రాయాలు కుండబద్దలు కొట్టారు. ఏంచేస్తే తిరిగి పార్టీకి పునరుత్తేజం కలుగుతుందో ఏకరువు పెట్టారు. కాగా ఊహించినట్టే అధినేత సమీక్షకు తోటత్రిమూర్తులు డుమ్మా కొట్టారు. దీంతో ఈయన స్థానంలో కొత్త నేత ఎంపికకు చంద్రబాబు ఓకే చెప్పారు. అటు ప్రతిప్తాడు నియోజకవర్గ ఇంఛార్జి ఎవరనేది తేల్చడానికి రెండు నియోజకవర్గాలకు వేర్వేరుగా ఫైవ్‌మెన్‌ కమిటీ నియమించి పేర్లు ఖరారుకు చేయాలని ఆదేశించారు. జిల్లా పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై సీనియర్‌ నేతలతో రహస్య సమావేశమై చంద్రబాబు చర్చించారు. ఎన్నికల తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు, క్యాడర్‌లో ఉత్తేజం నింపారు. అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న నాయకులు, కార్యకర్తలకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని భరోసా ఇచ్చారు.
 
కేసులు తొలగే వరకు పోరాటం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో à°—à°¡à°šà°¿à°¨ అయిదేళ్లలో పార్టీ క్యాడర్‌ మనోభిప్రాయాలకు దూరంగా మసలాననే తలంపుతో à°ˆ పర్యటనలో ప్రతి కార్యకర్తకు చేరువయ్యారు. వారితో రెండు రోజులు మమేకమయ్యారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. అటు కార్యకర్తలు, నేతలు కూడా ఇన్నాళ్లకు తమ అభిప్రాయాలను సాంతం విన్న అధినేత తీరుతో మురిసిపోయారు. తమకు నాయకత్వం లేకున్నా పార్టీని దర్జాగా నడిపిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో 19 నియోజకవర్గాల సమీక్ష చేసిన చంద్రబాబు వెళ్తూవెళ్తూ మనసులో మాట బయటపెట్టారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో భేటీ తర్వాత తానేం కోల్పోయానో అర్థమైందని బహిరంగంగా పేర్కొన్నారు. తూర్పుగోదావరి నుంచి సంతోషంగా వెళ్తున్నట్టు వెల్లడించారు. సీఎంగా తీరిక లేకపోవడంతో జిల్లాలో పార్టీకి, క్యాడర్‌కు చెయ్యాల్సిన పనులు చేయలేదని తనకు అర్థం అయ్యిందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.