మన సామర్థ్యం నిరూపించుకుంటాం

Published: Sunday September 08, 2019
ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మన శాస్త్రవేత్తలు 48 రోజులపాటు 3.84 à°•à°¿.మీ చంద్ర మాడ్యూల్‌ను పయనింపజేశారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగే ప్రక్రియ క్లిష్టతరమైనా దాదాపు 12 నిమిషాలు విజయవంతంగా నిర్వహించారు. మరో 3 నిమిషాల్లో చంద్రుడిపైకి ల్యాండర్‌ దిగనుండగా సంకేతాలు తెగిపోయినంత మాత్రాన అపజయం కాదు. ఇస్రో గ్రేట్‌ జాబ్‌à°—à°¾ భావిస్తున్నాం’’ అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విశ్రాంత సీనియర్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు. కేవలం విక్రమ్‌ ల్యాండింగ్‌ చివరిలో విఫలమయ్యామేకాని చంద్రయాత్రలో మాత్రం విజయం సాధించామని వారు  à°¤à°® అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 
చంద్రయాన్‌-2 ప్రయోగం 99 శాతం విజయవంతమైనట్టుగానే భావించాలి. ఎందుకంటే 48 రోజులపాటు విజయవంతంగా చంద్రుడి వద్దకు చంద్ర మాడ్యూల్‌ పయనింపచేశారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 3.84 లక్షలు కిలోమీటర్ల దూరం చంద్ర మాడ్యూల్‌ను పయనింపచేయడం ఆషామాషీ కాదు. చంద్రుడిపై దిగే చివరి 15 నిమిషాలు బీభత్సమంటూ ఇస్రో చీఫ్‌ శివన్‌ ముందే గ్రహించారు. అయినా రెండేళ్లపాటు ఎన్నోమార్లు చంద్రగ్రహాన్ని పొలిన పరిస్థితులను ఏర్పాటు చేసుకొని ల్యాండింగ్‌ ప్రక్రియను మా శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీంతో శివన్‌ సైతం విజయంపై పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారు. కానీ చివరి నిమిషాలలో విజయం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది.
 
విక్రమ్‌ ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు ప్రారంభంలో రఫ్‌ బ్రేకింగ్‌ అద్భుతంగా జరిగింది. వేగం ఊహించిన విధంగానే నియంత్రించబడింది. తదుపరి ఫైర్‌ బ్రేకింగ్‌లోనూ 4 ఇంజన్లు సమర్ధవంతంగా పనిచేయడం ప్రారంభించాయి. దీంతో గణనీయంగా విక్రమ్‌ వేగం కూడా తగ్గింది. ఆన్‌బోడ్‌ సెన్సార్లు చంద్రుడికి, విక్రమ్‌కు ఉన్న దూరాన్ని ఖచ్చితంగా గుర్తించాయి. లేజర్‌ ఆల్టిమేటర్‌, రేడియే ప్రీక్వెన్సీ, ఆల్టిమేటర్లు ఆన్‌బోడ్‌ కంప్యూటర్‌తో అనుసంధానం అయ్యాయి. అయితే విచిత్రంగా à°† సమయంలో విక్రమ్‌ భూ కేంద్రాలతో సంకేతాలు కోల్పోయింది. జస్ట్‌ చంద్రుడికి 2.1 కిలోమీటర్లు దూరంలో à°ˆ సంఘటన జరిగింది. దీనివల్ల చంద్రుడిపై దిగలేకపోయామేగాని చంద్రయాత్ర మాత్రం విజయవంతంగానే జరిగింది. విక్రమ్‌ సంకేతాలు లింక్‌ కోల్పోవడంతో ఇక దానిని కనుగొన్నా ఉపయోగం ఉండదు. అందులోని పరికరాలు పూర్తిగా పాడైపోయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మా శాస్త్రవేత్తలు డేటా పరిశీలిస్తూ వైఫల్య కారణాన్ని అన్వేషిస్తున్నారు.