ఒరిగిపోయిన అపార్ట్‌మెంట్‌..

Published: Friday September 20, 2019
కాకినాడలో à°“ అపార్టుమెంటు ఎప్పుడు కూలుతుందో తెలియనిస్థితిలో క్షణక్షణ భయంభయంగా ఉంది. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. కాకినాడ నగరంలోని దేవీ మల్టీప్లెక్స్‌(సినీ థియేటర్స్‌) కూడలివద్ద ఉన్న ఐదంతస్తుల భాస్కర్‌ ఎస్టేట్స్‌ అపార్టుమెంట్‌ సెల్లార్లలో వెనుక భాగం మూడు పిల్లర్లు శిథిలమయ్యాయి. దీంతో గురువారం భవంతి కుంగిపోయింది. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన రెవెన్యూ, నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్లాట్లల్లో నివాసితులను ఖాళీ చేయించారు.
 
2005లో విక్టరీ కనస్ట్రక్షన్స్‌ పేరుతో నలుగురు పార్టనర్స్‌ కలిసి à°ˆ అపార్టుమెంట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. వారివద్దే ప్లాట్లు కొనుగోలు చేశామని బాధిత నివాసితులు వాపోతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇప్పుడు à°ˆ పరిస్థితి ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. అపార్టుమెంట్‌లో 40 కుటుంబాలు వరకు ఉన్నాయి. వీరందరూ ఉన్నట్టుండి ఖాళీ చేయమనడంతో ఎటు వెళ్లాలో తెలియక బోరుమని విలపిస్తున్నారు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని చేసేది లేక సామాన్లతో సహా ఖాళీ చేస్తున్నారు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అపార్టుమెంట్‌ పక్కనే ఉంటున్న వారిని సైతం ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. దీంతో à°ˆ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న వారితోపాటు సమీప ప్రాంతాల వారు కూడా ఖాళీ చేస్తున్నారు. అపార్టుమెంట్‌లో సొంత ప్లాట్లు ఉన్న వారికి సమాధానం చెప్పే వారు కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో గగ్గోలు పెడుతున్నారు.
 
à°ˆ సంఘటన బుధవారం రాత్రి 8గంటలకే చోటు చేసుకుంది. రాత్రి 8గంటలకు మూడు పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. రాత్రి 12గంటలకు పగుళ్లు ఏర్పడి శబ్ధం వచ్చినట్లు అక్కడ వాచ్‌మెన్‌ తెలిపాడు. ఉదయానికి విషయం తెలియక చాలామంది తమ విధుల్లో భాగంగా బయటకు వెళ్లిపోయారు. పొద్దున్నకల్లా మూడు పిల్లర్లు పూర్తిగా శిథిలమై కిందకు ఒరగడంతో సమాచారం తెలుసుకున్న వారంతా అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే నగరపాలకసంస్థ టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ విభాగ అధికారులు అపార్టుమెంట్‌ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు అపార్టుమెంట్‌ ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్‌ à°¡à°¿.మురళీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు మొత్తమంతా ఖాళీ చేశాక ఆర్డీవో చిన్నికృష్ణ ఆధ్వర్యంలో తాళాలు వేయించారు. కార్పొరేషన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 456 ప్రకారం బిల్డింగ్‌ను మూడురోజుల్లో కూల్చివేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ బిల్డింగ్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. బిల్డర్‌ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ ఠాగూర్‌ తెలిపారు. కాగా à°ˆ అపార్టుమెంట్‌ నిర్మాణంలో à°“ ప్రజాప్రతినిధికి భాగస్వామ్యం ఉందని సమాచారం.