విరాట్‌ విశాఖ వస్తోంది

Published: Tuesday January 02, 2018

విశాఖపట్నం : మహా నగర విశాఖపట్నం  పరిధిలోని రుషికొండ.. భీమిలి.. మంగమూరిపేట, మూలకుద్దు.. తదితర సాగర తీర ప్రాంతాలు విరాట్‌ను కొలువుదీర్చేందుకు అనువైన ప్రాంతాలుగా పర్యాటకశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక అంచనాకు వచ్చేందుకు సర్వే కూడా చేసింది. దిల్లీలోని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమైన రాష్ట్ర అధికారులు విశాఖ à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°¾à°¨à°¿à°•à°¿ ఉన్న ప్రాధాన్యాన్ని దృశ్యరూపికలో వివరించారు.

 

à°ˆ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు రూ. వెయ్యి కోట్ల భారీ వ్యయం అవుతుందని తొలుత అంచనాలు వేశారు. ఇప్పుడు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చవొచ్చని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై అధికార వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. à°ˆ నిధులు నౌకను లంగరు వేయడానికే సరిపోతాయని చెబుతున్నారు. దీని నిర్వహణకు రూ. కోట్లలో వెచ్చించాలంటున్నారు. à°ˆ భారీ నౌకను నిలపాలంటే 18 ఎకరాల స్థలం అవసరం. దీన్ని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనశాలగా మార్చేందుకు పార్కింగ్‌ ప్రాంతం, విన్యాసాల వేదికలు.. ఇతర హంగులతో పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో మార్చాలంటే దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం భారీగా నిధులు వెచ్చించి భూ సేకరణ చేయాల్సి ఉంది. à°ˆ మొత్తాన్ని ఎక్కడెక్కడ నుంచి సమకూర్చాలన్నదానిపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన ప్రభుత్వం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతోపాటు నౌకాయాన, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతోంది. తొలుత à°ˆ ప్రాజెక్టు బాధ్యతను వుడా చేపడుతుందని భావించినా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. దీంతో రాష్ట్ర పర్యాటకశాఖ కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని పట్టాలెక్కించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.