మాకు భరోసా ఏంటి?.. ‘104’ ప్రైవేటు చేతికా?

Published: Friday September 27, 2019
గ్రామీణులకు చేరువైన 104 అంబులెన్స్‌ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమను విస్మరిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 104 వాహనాల నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం వల్ల వైద్య సేవలు మందగించడంతో పాటు, ఉద్యోగులకు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. à°—à°¤ మూడేళ్లలో నిర్వహణ కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేశారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో ఉద్యోగులు అనేకసార్లు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్‌ను కలిశారు. ఆయన కూడా ఉద్యోగులకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం హామీతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు భావించారు. కానీ, ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. అదేసమయంలో వాహనాల నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించే విషయంపై మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వాహనాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తుందని ఉద్యోగులు భావించారు. సీఎం దగ్గర నుంచి మంత్రులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వరకు అందరూ ఇదేవిధంగా హామీ ఇవ్వడంతో వారి ఆశలకు మరింత బలం చేకూరింది. కానీ, ప్రస్తుత పరిస్థితి ఉద్యోగులు ఊహించిన దానికి భిన్నంగా ఉంది. ఏపీఎ్‌సఎంఐడీసీ ప్రైవేటు కంపెనీలతో సమావేశం నిర్వహించడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. à°ˆ నేపథ్యంలో తమకు ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
 
పాదయాత్ర సమయంలో జగన్‌ 104 ఉద్యోగులను రెగ్యులర్‌ లేదా నేరుగా ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు à°† హామీని ప్రభుత్వం విస్మరించి, ప్రైవేటు కంపెనీలతో సమావేశాలు నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. à°—à°¤ ఆదివారం ఏలూరులో మంత్రి ఆళ్ల నానిని 104 ఉద్యోగులు కలిసి, వారి సమస్యలను వివరించారు. ఉద్యోగుల సమస్యలు విన్న మంత్రి సోమవారం సచివాలయానికి రావాలని ఆహ్వానించారు. మంత్రి పిలుపు మేరకు వెళ్లిన ఉద్యోగులు, మంత్రి శుభవార్త చెబుతారని భావించినా, అక్కడ మంత్రి ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ‘మీ విషయం ఇప్పుడే ఏం చెప్పలేం. మీరు ఇప్పుడెందుకు వచ్చారు. రెండు రోజుల తర్వాత చూద్దాం. ప్రభుత్వానికి కొన్ని పాలసీ నిర్ణయాలు ఉంటాయి. వాటిని కాదని ఏం చేయలేం’ అని మంత్రి చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి కూడా సానుకూల స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
 
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 104 ఉద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. తొలిరోజు వైఎస్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 27 వరకు జిల్లాల్లో ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. 28 నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్తున్నారు.