అర్హత సాధించాక, సర్టిఫికెట్ల పరిశీలనలో కట్టడి

Published: Sunday October 06, 2019
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, à°ˆ మధ్యనే పూర్తిచేసిన వార్డు కార్యదర్శుల నియామక ప్రక్రియలో లోటుపాట్లు ఇంకా వెలుగు చూస్తున్నాయి. à°ˆ నియామకానికి సంబంధించిన రాత పరీక్షకు హాజరై, తగినన్ని మార్కులు కూడా పొంది, ఇక ఉద్యోగాలు పొందడమే తరువాయి అని ఆశ పడిన వందల మంది అభ్యర్థులు మాత్రం ఉసూరుమంటున్నారు! పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేస్తున్న వార్డు సచివాలయాల్లోని 10 క్యాటగిరీల వార్డు కార్యదర్శుల పోస్టులకు అర్హులను ఎంపిక చేసేందుకు కొన్ని వారాల కిందట ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. à°ˆ పోస్టుల్లో ఒకటైన ‘వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి’ ఉద్యోగానికి ఆర్ట్స్‌ లేదా హ్యుమానిటీ్‌సలో డిగ్రీ, ఆపైన ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొంది. దాని ప్రకారం చూస్తే à°ˆ ఉద్యోగాలకు బీఏ పాసైన వారు మాత్రమే అర్హులు. కానీ బీకాం/బీఎస్సీ పూర్తిచేసిన వందలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు.
 
నిర్ణీత అర్హతల్లేకుండా వారు దరఖాస్తు చేసుకోవడం à°’à°• తప్పయితే, సదరు దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే పరిగణనలోకి తీసుకుని, హాల్‌ టికెట్లు మంజూరు చేయడం నియామక ప్రక్రియలో జరిగిన ప్రధాన తప్పిదం. à°† తర్వాత పైన పేర్కొన్న అభ్యర్థులందరూ వార్డు కార్యదర్శుల నియామక పరీక్షలకు హాజరవగా, వారిలో వివిధ జిల్లాలకు చెందిన వందలాదిమంది ఉద్యోగాలు పొందడానికి అవసరమైన మార్కులను సాధించారు. à°ˆ నేపథ్యంలో తమ విద్యార్హతలను నిర్ధారించే సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు నియామకపత్రాలను త్వరలో పంపుతామని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైన వారు నియామకపత్రాలను అందుకున్నారు. ఇతర జిల్లాల్లో మాత్రం వారికి నియామకపత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. కొన్ని జిల్లాల్లో ఇచ్చారని... ఇక్కడెందుకు ఇవ్వలేదని ఆయా జిల్లాల్లోని వందలాదిమంది ప్రశ్నించారు. దీంతో à°† జిల్లాల్లో సైతం ఉన్నతాధికారులు రద్దు చేశారు.
 
వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి పోస్టులకు తమకు తగిన అర్హతల్లేవని అధికారులు స్ర్కూటినీ సమయంలోనే పేర్కొని, తమ దరఖాస్తులను తిరస్కరించినట్లయితే తమకు à°ˆ పరీక్షల కోసం వెచ్చించిన సమయం, శక్తి కలిసి వచ్చేవని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. à°† తర్వాతైనా à°† విషయాన్ని స్పష్టం చేయకుండా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవడం, అప్పుడు కూడా త్వరలోనే నియామకపత్రాలను పంపుతామనడంతో తాము కచ్చితంగా ఉద్యోగాలు పొందబోతున్నామని ఎంతగానో సంతోషించామని చెబుతున్నారు. ఇప్పుడు తాపీగా తమను అనర్హులుగా పేర్కొంటూ, ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం దారుణమని వాపోతున్నారు.
 
బీకాం చదివి ఉద్యోగాలు పొందినవారు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సగటున 50 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని 60 మంది ఉండగా వీరు శనివారం చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. అనంతపురంలో 21, చిత్తూరులో 41, కడపలో 40 మందికిపైగా, కర్నూలులో 23 మందిని గుర్తించి అధికారులు తొలగించినట్టు సమాచారం.