తెదేపా సభకు ఆటంకం , ఆలస్యమయ్యే సూచనా

Published: Monday April 30, 2018

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో తారకరామ స్టేడియంలో 'నమ్మకద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం' పేరిట తెదేపా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సభకు తరలివస్తున్నవారిని నేతలు వాహనాల్లోనే ఉంచుతున్నారు. దీంతో సభ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతోంది. à°¤à°¿à°°à±à°®à°² శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల దర్శనానికి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకుని నేరుగా సభాప్రాంగణానికి ఆయన చేరుకోనున్నారు. à°ˆ మధ్యాహ్నం తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చిరుజల్లులు కూడా కురిశాయి. ఇప్పటికే ప్రధాన వేదిక సిద్ధమైంది. వేదికపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసీనులు కానున్నారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలతో à°ˆ సభ ప్రారంభం కానుంది.