లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు

Published: Friday October 11, 2019
ఇసుక లేక ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొల్లు రవీంద్ర పెట్టిన దీక్షకు ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో దీక్షలు చేయడం సహజమని, దీక్షకు వెళుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అత్యుత్సాహంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇసుక కొరత ప్రజలకు తెలియకూడదని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, తాము డీజీపీకి ఫిర్యాదు చేసినా, కొల్లు రవీంద్ర నిరాహార దీక్ష చేసినా, చంద్రబాబు ఛలో ఆత్మకూరు చేసినా... అన్నింట్లో వైసీపీ పోటీకొస్తుందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామన్న విషయం గ్రహించాలని, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని భావిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో టన్నుల కొద్దీ ఇసుక పక్క రాష్ట్రాల రాజధానులకు పోతోందని దేవినేని ఉమా ఆరోపించారు.
 
ఇసుక పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే à°ˆ ప్రభుత్వానికి కళ్ళు లేవా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. రేపు కృష్ణాజిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మచిలీపట్నంలో జరుగుతుందని, కొల్లు రవీంద్ర దీక్షకు సంఘీభావం తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దీక్షలు జరుగుతాయన్నారు. నీలో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటే, జగన్మోహన్ రెడ్డి వీడియో గేమ్‌లు ఆడుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు ఇరవైవేల కోట్లు నష్టం జరిగిందన్నారు. యాభై రూపాయల చీప్ మద్యం బాటిల్ వంద రూపాయలకు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.