ఎంసెట్లో అబ్భాయిల హవా, టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే

Published: Wednesday May 02, 2018

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా కాకినాడ జేఎన్టీయూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు.

ఏపీ ఎంసెట్ ఆన్ లైన్ విధాంలో నిర్వహించారు. లక్షా 99వేల మంది పరీక్షలు రాస్తే, లక్షా 38వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 137 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు.

మెడిసిన్‌లో ఉత్తీర్ణత శాతం 87.60à°—à°¾ ఉంది. ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత 72.28 శాతంగా ఉంది. ఎంసెట్ కీలో 124 ప్రశ్నలపై అభ్యంతరాలు వచ్చాయి.

గత ఏడాదితో పోలిస్తే అర్హత సాధించిన వారి శాతం తగ్గింది. హైదరాబాదులో 6 కేంద్రాలతో పాటు మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే

ఎంసెట్ పరీక్షల్లో టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)కు మొదటి ర్యాంకు వచ్చింది. గట్టు మైత్రేయకు రెండో ర్యాంగ్ వచ్చింది. మెడిసిన్ విభాగంలో సాయిప్రియకు మొదటి ర్యాంకు వచ్చింది.

ఫలితాలు ఇలా చూసుకోండి: sche.ap.gov.in, www.sche.ap.gov.in/eamcet, www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in and www.schools9.com

source: oneindia.com