గెలిపించినందుకు బహుమానం ఇదా!

Published: Thursday October 17, 2019

‘‘చంద్రబాబుపై ఉన్న కోపంతో సీఎం జగన్‌ రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కన్నా జగన్‌ ఎంతో మేలు చేస్తారని ఎన్నికల్లో రైతులు వైసీపీని గెలిపించారు. అందుకు à°ˆ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం.. రైతుల రుణమాఫీ బకాయిల చెల్లింపులు రద్దు చేయడం’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. à°—à°¤ ప్రభుత్వాలు అమలు చేసిన సున్నా, పావలా వడ్డీలను టీడీపీ ప్రభుత్వం కొనసాగించిన విషయాన్ని జగన్‌ పరిశీలించుకోవచ్చన్నారు. రూ.3 వేల కోట్లు ఖర్చు అయ్యే సున్నా వడ్డీ పఽథకాన్ని రైతులందరికీ వర్తింపచేస్తామని నిండు సభలో హామీ ఇచ్చిన సీఎం.. బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. వచ్చే బడ్జెట్‌లో అయినా మిగిలిన మొత్తాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి సాయం à°•à°¿à°‚à°¦ రూ.12,500 ఇస్తానని ప్రకటించిన జగన్‌ ఇప్పుడు పీఎం కిసాన్‌ సమ్మాన్‌తో కలిపి కేవలం రూ.13,500 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని సోమిరెడ్డి వివరించారు. రైతు భరోసాపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుంటూరులో విమర్శించారు. ఇది రైతు మోస పథకమని మండిపడ్డారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని మంత్రి కన్నబాబు చెప్పారని, మరి కేవలం 3 లక్షల మందికే భరోసా ఇవ్వడం అన్యాయం కాదా? అని ఆయన నిలదీశారు.