సర్జికల్‌ వస్తువుల పరిస్థితీ అంతంతే

Published: Thursday October 24, 2019
ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. కనీసం జ్వరమొస్తే ఇచ్చే పారాసిటమాల్‌, గర్భిణీలకిచ్చే ఐరన్‌ మందులకూ కటకటలాడాల్సిన పరిస్థితి తలెత్తింది. యాంటీబయాటిక్‌ మందులు కూడా అందుబాటులో లేవు. మందుల సంగతి పక్కనబెడితే కనీసం ఇంజెక్షన్‌ చేసేందుకు సూది.. రక్తం కారితే తుడిచేందుకు దూదికి కూడా కరువొచ్చింది. వర్షాకాలం, చలికాలంలో ఆస్పత్రులకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వైరల్‌ ఫీవర్ల సీజన్‌ కాబట్టి పారాసిటమాల్‌ మందులు, డైక్టోఫినాక్‌ ఇంజెక్షన్‌, యామోక్సిలిన్‌, జెంటామైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా అవసరం అవుతాయి. కానీ.. ప్రస్తుతానికి ప్రభుత్వాస్పత్రుల్లో à°ˆ మందులేవీ అందుబాటులో లేవు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వంటి పెద్దాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది.
 
మందులు సరఫరా చేయాల్సిన సీడీఎస్‌ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌)లో మందులు లేకపోవడంతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు లోకల్‌à°—à°¾ కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సర్జికల్‌ వస్తువుల సరఫరాలోనూ ఏపీఎ్‌సఎంఐడీసీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సూది, దూదిని కూడా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు లోకల్‌à°—à°¾ కొనుగోలు చేసుకుంటున్నారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి పెద్దాస్పత్రుల్లో నాలుగు నెలలుగా 500 గ్రాముల కాటన్‌ బ్యాండేజ్‌లు అందుబాటులో లేవు. దీంతో శస్త్రచికిత్సల సమయంలో 100 గ్రాముల కాటన్‌ బ్యాండేజ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. మేజర్‌ శస్త్ర చికిత్సలు చేసినప్పుడు రక్తస్రావం ఎక్కువ అవుతుంది. à°† సమయంలో కచ్చితంగా 500 గ్రాముల కాటన్‌ బ్యాండేజ్‌ను ఉపయోగించాలి. అప్పుడే రక్తస్రావాన్ని నియంత్రించడం వీలవుతుంది. సీడీఎస్‌ నుంచి సరఫరా లేకపోవడం వల్లే తాము 100 గ్రాముల కాటన్‌ ఉపయోగించాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాటన్‌ కొరత ఏర్పడింది. à°ˆ ఏడాది మార్చిలో కాటన్‌ సరఫరాకు సంబంధించిన టెండర్లను కార్పొరేషన్‌ అధికారులు పిలిచారు. à°† సమయంలో 100 గ్రాముల కాటన్‌ బ్యాండేజ్‌ టెండర్‌ను మాత్రమే ఫైనల్‌ చేశారు. 500 గ్రాముల బ్యాండేజ్‌à°² టెండర్‌ వాయిదా వేశారు. దీంతో కొరత తీవ్రమైంది. రెండు వారాల కిత్రం మళ్లీ టెండర్లు పిలిచి, ఫైనల్‌ చేశారు.
 
ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా డిస్పోజబుల్‌, ఆటో డిసేబుల్‌ సిరంజ్‌లను ఉపయోగిస్తుంటారు. మూడు నెలలుగా à°ˆ రెండు రకాల సిరంజ్‌లు అందుబాటులో లేవు. వీటిని కూడా బయట కొనుగోలు చేసుకుంటున్నారు. గుంటూరు, విజయవాడ లాంటి పెద్దాస్పత్రులకు మందులు, సర్జకల్‌ ఐటమ్స్‌ సరఫరా చేసే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో ఒక్క à°°à°•à°‚ సిరంజ్‌లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. డిస్పోజబుల్‌ సిరంజ్‌ల్లో అత్యధికంగా ఉపయోగించే 2సిసి-23, 24 సిరంజలు ఒక్కటి కూడా లేవు. 5సిసి-23 సిరంజ్‌లు మూడు లక్షలు, 5సిసి-24 సిరంజ్‌లు 48 వేలు ఉన్నాయి. ఆటో డిసేబుల్‌ సిరంజ్‌లలో 2సిసి-23లో మూడు లక్షలు, 2సిసి-24లో 2 లక్షలు, 3సిసి-23లో 36 వేలు మాత్రమే ఉన్నాయి. à°ˆ రెండు పెద్దాస్పత్రులకు కలిపి నెలకు రెండు లక్షలపైగా సిరంజ్‌లు అవసరం. గ్ల్లౌజ్‌à°² సరఫరాలోనూ ఇదే పరిస్థితి ఉంది