కంటైనర్‌ ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లిన టెంపో..

Published: Sunday October 27, 2019
మాదాలు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో.. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో దూసుకొస్తుందో చెప్పలేం!.. à°•à°¡à°ª జిల్లా రాజంపేట మండల పరిధిలోని చెన్నై-à°•à°¡à°ª జాతీయ రహదారిలో శనివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఆటోను తప్పించిబోయి à°“ కంటైనర్‌ టెంపోను ఢీకొనడంతో.. à°† టెంపో à°“ ఇంటిపైకి దూసుకెళ్లి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఐదుగురు గాయపడ్డారు. మన్నూరు సీఐ నరసింహులు కథనం మేరకు.. శనివారం రాత్రి à°•à°¡à°ª నుంచి చెన్నైకి వెళుతున్న గుజరాత్‌కు చెందిన కంటైనర్‌, చింతకొమ్మదిన్నెకు వెళుతున్న టెంపో రాజంపేట పట్టణానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని ఊటుకూరు వద్ద ఎదురుపడ్డాయి.
 
 
అక్కడి మలుపు వద్ద ఆటోను తప్పించే క్రమంలో కంటైనర్‌ వాహనం టెంపోను ఢీకొంది. దీంతో à°† టెంపో.. హైవే పక్కనున్న à°“ ఇంట్లోకి దూసుకెళ్లి, ఇంటి యజమాని వెంకటనరసయ్య(60)తోపాటు, టెంపో డ్రైవర్‌ మహమ్మద్‌(28), అదే వాహనంలో ఉన్న ప్రవీణ్‌(21)అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. టెంపో వాహనం బలంగా ఢీకొనడంతో భవనం గోడతో పాటు స్లాబ్‌ కూలిపోయి టెంపోలోని ఇద్దరు మృతిచెందారు. టెంపోలోనే ఉన్న చింతకొమ్మదిన్నెకు చెందిన మునీశ్వర్‌రెడ్డి, రాజారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, గంగిరెడ్డి, కంటైనర్‌లోని జాఫర్‌ గాయపడ్డారు. కంటైనర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. à°ˆ సంఘటన నేపథ్యంలో ఊటుకూరు గ్రామస్థులు శనివారం రాత్రి హైవేపై వెంకటనరసయ్య మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో నిర్వహించారు