రామానాయడు స్టూడియో దగ్గర భారీ బంధోబస్త్ , ప్రత్యక్ష పోరుకు రెడీ.......

Published: Wednesday May 02, 2018

హైదరాబాద్ లోని రామానాయడు స్టూడియో దగ్గర భారీ పోలీస్ బంధోబస్త్ ఏర్పటు చేసారు. కాస్టింగ్ కౌచ్ ఫై పోరాటం అంటూ శ్రీ రెడ్డి పాపులర్ అయినా సంగతి తెల్సిందే. తాజాగా ఈమె ప్రత్యక్ష పోరుకు రెడీ కాబోతుందని , మహిళాసంఘాలతో కలిసి శ్రీరెడ్డి అటు రామానాయుడు స్టూడియో దగ్గర లేదా? ఓ డైరక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగబోతోందని పోలీస్ వర్గాలుకు సమాచారం అందడంతో వారు రామానాయుడు స్టూడియో దగ్గర భారీగా బందోబస్త్ ఏర్పటు చేసారు.

కాస్టింగ్ కౌచ్ ఫై పోరాటం అంటూ మొదలు పెట్టిన శ్రీ రెడ్డి పోరాటం , ఆ తర్వాత అది పక్కదారి పట్టడం తో ఈమెను పట్టించుకునే నాధుడు కరువయ్యారు. న్యూస్ చానెల్స్ సైతం ఈమెను పిలవడం కానీ , ఈమె వైపు చూడడం కానీ మానేశాయి. దీంతో ఎలాగైనా మళ్లీ వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యం తో మహిళా సంఘాలతో కలిసి మళ్లీ పోరాటడం మొదలు పెట్టబోతుందట. అందుకే ముందుగా రామానాయుడు స్టూడియో ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.