తీవ్ర ఇసుక కొరత తీసిన ప్రాణం

Published: Monday October 28, 2019
 ‘రాశీ! నేను నీకు అన్యాయం చేస్తున్నాను. కొడుకును జాగ్రత్తగా చూసుకో. కొన్నాళ్లుగా పనులు లేక మీ అమ్మగారిపై ఆధారపడలే à°•, డబ్బులు లేక, à°† కోపం నీపై చూపిస్తున్నాను. నాపై నాకే సిగ్గుగా ఉంది. కుటుంబా న్ని కూడా పోషించుకోలేని నేను బతకడం అవసరమా అని చనిపోతున్నాను’.. ఇది ఇసుక కొరతతో పనులు లేక à°“ ప్లంబర్‌.. తన భార్యనుద్దేశించి చేసిన వీడియో పోస్టు! à°ˆ నెల 2à°¨ à°ˆ పోస్టు పెట్టి పోలేపల్లి వెంకటేశ్వరరావు(29) ఆత్మహత్య చేసుకొన్నారు. ఇసుక కొరత ఉసురు తీసిన à°ˆ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంపత్యంలో రేగిన గొడవలతో వెంకటేశ్వరరావు చనిపోయాడని అంతా భావించగా, భార్యకు ఆయన పోస్ట్‌ చేసిన వీడియో ఇన్నాళ్లకు వెలుగులోకి రావడంతో ఆత్మహత్యకు అసలు కారణం బయటకొచ్చింది.
 
అసలు ఏం జరిగిందనేది శనివారం గోరంట్లలో ఉంటున్న ఆయన భార్య రాశి కన్నీటితో వివరించారు. ‘‘8నెలలుగా పనులు లేవు. ఇసుక కొరతతో చేయడానికి ఏమీ లేదు. అప్పు కూడా ఎక్కడా పుట్టలేదు. స్వతహాగానే ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. ఇంత కష్టంలోనూ మా పుట్టింటివారు చేసే సహాయాన్ని తీసుకొనేవాడు కాదు. ఇది చాలదు అన్నట్టు, మా ఏడాది కుమారుడు చరణ్‌ అనారోగ్యం పాలయ్యాడు. వాడికి బీర్జాలలో సమస్య వచ్చింది. ఆపరేషన్‌కు రూ.50వేలు అవుతాయని వైద్యులు చెప్పారు. ఒకేసారి ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. నన్ను మా పుట్టింటికి పంపి, అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు’’ అని రాశి కన్నీటిపర్యంతమయ్యారు. చనిపోవడానికి ముందుగా తన ఆవేదననంతా వీడియోలో రికార్డు చేసి భార్యకు వెంకటేశ్వరరావు పోస్టు చేశారు. అయితే, తాము à°† వీడియో విషయం ఫోన్‌ చూసిన తరువాతే తెలుసుకొన్నామని అత్త ధనలక్ష్మి తెలిపారు. ఆరు నెలలుగా బియ్యం పంపుతూ తమకు తోచిన సహాయం చేస్తున్నానని వాపోయారు. పనులు లేకే తన అల్లుడు చనిపోయిన విషయం పోలీసులకు అదే రోజు చెప్పామని, కానీ, వారు పట్టించుకోలేదని ఆమె తెలిపారు.