: ఏపీ ఎడ్‌సెట్-2018 పరీక్షా ఫలితాలు విడుదల

Published: Thursday May 03, 2018

అమరావతి: à°à°ªà±€ ఎడ్‌సెట్-2018 ఫలితాలను మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు పరీక్షకు 7,679మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 7,430 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. మొత్తం 96.75శాతం ఉత్తీర్ణత పొందారన్నారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ఎడ్‌సెట్ పరీక్షలు వెంటేశ్వర యూనివర్శిటీ పరిధిలో జరిగాయని మంత్రి తెలిపారు. మార్చి 5à°¨ నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్ 19à°¨ పరీక్ష నిర్వహించామన్నారు. ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 462 బీఈడీ కాలేజీల్లో 39,010 సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. జూన్ చివరి వారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని యోచినట్లు మంత్రి గంటాశ్రీనివాసరావు చెప్పారు.