లారీని ఢీకొన్న బస్సు ఇద్దరి మృతి..

Published: Saturday November 02, 2019
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ప్యాపిలి సమీపంలోని చిరుతల గుట్ట వద్ద ముందు వెళుతున్న సిమెంటు లారీని ఢీకొంది. అదుపుతప్పి డివైడర్‌ దాటి గుట్టను ఢీకొంది. à°ˆ ప్రమాదంలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేష్‌ కుమార్‌(20), చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌(29) మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
 
 
కర్నూలు జిల్లా ప్యాపిలి సమీపంలో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 44పై ముందు వెళుతున్న సిమెంటు లారీని బలంగా ఢీకొని.. అదుపు తప్పి చిరుతల గుట్టను ఢీకొంది. à°ˆ ఘటనలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేష్‌ కుమార్‌(20), చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌(29) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌ఐ మారుతి శంకర్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. కర్ణాటకకు చెందిన కేఏ 01 ఏజే 0322 నెంబరు à°—à°² బస్సు బెంగళూరు నుంచి గురువారం రాత్రి 11 గంటలకు హైదరాబాదుకు బయలు దేరింది.
 
బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్యాపిలి సమీపంలోని చిరుతలగుట్ట వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న సిమెంటు లారీని బలంగా ఢీ కొట్టింది. అదుపు తప్పి డివైడర్‌ దాటి కుడి వైపున ఉన్న గుట్టను ఢీకొట్టింది. à°ˆ ప్రమా దంలో మృతి చెందిన విశ్వనాథ్‌ చిత్తూరు జిల్లా చంద్రమాకుల గ్రామానికి చెందినవారు. సురేష్‌ కుమార్‌ది చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లా. చత్తీస్‌ఘడ్‌à°•à°¿ చెందిన మనోజ్‌ కుమార్‌, హైదరాబాదుకు చెందిన మనోహర్‌ గాయపడ్డారు. డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణ మని ఆయన తెలిపారు.