ప్రజల్ని చైతన్యం చేయడానికి జేఏసీ

Published: Wednesday January 08, 2020
ప్రజల్ని చైతన్యం చేయడానికి జేఏసీ సిద్ధమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. బెంజ్‌ సర్కిల్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘రాష్ట్రం కోసం తమ వంతు బాధ్యతగా జేఏసీ ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలను జేఏసీ ఏకతాటిపైకి తెచ్చింది. రాజధానికి à°ˆ ప్రాంతం అనువైందని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారు. మొదట ల్యాండ్‌ పూలింగ్‌ అంటే ఎవరికీ అర్థం కాలేదు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు..నిధులు ఇచ్చారు. రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే అభివృద్ధి చేయలేదని అంటున్నారు. రాజధానికి విజయవాడ సరైన ప్రాంతమని గతంలో జగన్‌ అన్నాడు. ఇప్పుడు జగన్‌ ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారు’ అని విమర్శించారు.
 
 
‘సీఎం మారితే రాజధాని మారిపోతుందా?, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే రాజధానులు మారిస్తే పరిస్థితి ఎలా ఉండేది?, కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారు.. లేకుంటే à°ˆ ప్రభుత్వాన్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేవారు. ఇంత మంది రైతులు చనిపోతే ఎందుకు పరామర్శించడం లేదు?, రాజధాని ఏమైపోతుందన్న ఆవేదనతో రైతులు గుండెపోటుతో చనిపోయారు. వైసీపీకి చెందిన వ్యక్తి మరణించినా కుటుంబసభ్యులను పరామర్శించలేదు. ఇంకా à°Žà°‚à°¤ మందిని పొట్టన పెట్టుకుంటారు?, ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటికిరాని మహిళలు ధర్నాలు చేస్తున్నారు. రాజధానిలో 5 వేల మంది మహిళలు ర్యాలీ చేశారు’ అని గుర్తుచేశారు.
 
 
‘అసలు మూడు రాజధానులు చేయాలని ఎవరడిగారు?, రాజధానిలో ఒకే కులం వారు ఉన్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కంపెనీలన్నీ వెనక్కి వెళ్తున్నాయి.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. అమరావతికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న భవనాల్లోనే పాలన కొనసాగించండి.. మీరు ఏమీ చేయలేరు.. మేం వచ్చాక అమరావతిని పూర్తిచేస్తాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించండి. 5 కోట్ల మంది ఒప్పుకుంటే రాజధానిని ఎక్కడైనా పెట్టుకోండి. రాజధాని రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లాలి. అమరావతి..రైతుల సమస్య మాత్రమే కాదు..రాష్ట్ర ప్రజలందరిదీ. రాజధాని మారిస్తే మీ పతనం ప్రారంభమైనట్లే’నని వ్యాఖ్యానించారు.