సవరించిన బడ్జెట్‌లో టీటీడీ ‘సిత్రాలు’

Published: Wednesday January 08, 2020

 à°¤à°¿à°°à±à°®à°² శ్రీవారికి భక్తులు సమర్పించిన విరాళాలను తిరుమల ఆధ్వర్యంలోని సంస్థలకు, సేవలకు ఖర్చు చేయాల్సి ఉండగా.. తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యకలాపాలకు టీటీడీ మళ్లిస్తోంది. ముఖ్యంగా దేవదాయ శాఖకు భారీగా నిధులు మళ్లించడం వివాదాస్పదంగా మారింది. టీటీడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను సవరిస్తూ ఇటీవల పాలకమండలి సమావేశంలో చర్చకు పెట్టారు. ‘సర్వ శ్రేయోనిధి’à°—à°¾ పిలిచే కామన్‌ గుడ్‌ ఫండ్‌(సీజీఎ్‌à°«)కు బడ్జెట్‌లో తొలుత రూ.1.25 కోట్లు మాత్రమే కాంట్రిబ్యూషన్‌ à°•à°¿à°‚à°¦ కేటాయించారు. బడ్జెట్‌ సవరింపుల్లో ఏకంగా రూ.13.75 కోట్లు అదనంగా కేటాయించారు. దేవదాయశాఖ సంక్షేమ నిధికి తొలుత రూ.50 లక్షలు కేటాయించగా సవరింపుల్లో రూ.10 కోట్లకు పెంచారు. అర్చకుల వేతనాల నిధికి కూడా బడ్జెట్‌లో తొలుత రూ.50 లక్షలు కేటాయించిన టీటీడీ తాజా సవరింపుల్లో ఒకేసారి రూ.25 కోట్లకు పెంచింది. దేవదాయ శాఖ అర్చకుల వేతనాలకు బడ్జెట్‌లో తొలుత అసలు కేటాయింపులేవీ చేయలేదు. తాజా సవరింపుల్లో రూ.16 కోట్లు కేటాయించారు. మొత్తం మీద టీటీడీతో సంబంధంలేని దేవదాయ శాఖ వ్యవహారాలకు కాంట్రిబ్యూషన్‌ à°•à°¿à°‚à°¦ తొలుత రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించిన టీటీడీ పాలకమండలి.. సవరింపుల్లో రూ.66 కోట్లకు పెంచడం గమనార్హం. కామన్‌ గుడ్‌ ఫండ్‌, ఎండోమెంట్‌ అర్చక ఫండ్‌, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌లకు కాంట్రిబ్యూషన్‌ను వరుసగా రూ.15 కోట్లు, రూ.10 కోట్లు, రూ.25 కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు.