రైతులపై పోలీసుల జులుం

Published: Sunday January 12, 2020
మందడం గ్రామంలో టెంటు వేయొద్దని తొలుత పోలీసులు ఆదేశించారు. సరేనని నడిఎండలో రోడ్డుపైనే దీక్ష పట్టారు. అదీ కుదరదంటే.. à°“ ప్రైవేటు స్థలంలో రైతులు, మహిళలు ఉదయం ధర్నాకు కూర్చొన్నారు. మధ్యాహ్నం దాటాక గ్రామంలో శాంతియుత ప్రదర్శనకు వారు సిద్ధంకాగా, పోలీసులు à°† ర్యాలీనీ అడ్డుకొన్నారు. 144 సెక్షన్‌ ఉన్నందున గ్రామంలో ర్యాలీ చేయడానికి వీల్లేదన్నారు. దీంతో రైతులు, మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులతో తీవ్రస్వరంతో వాగ్వాదానికి దిగారు. ఏమైనా ర్యాలీని కొనసాగిస్తామంటూ ముందుకు కదిలారు. అంతే.. లాఠీలు గాల్లోకి లేచాయి.
 
మహిళలు, వృద్ధులు అని లేకుండా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. 40 మంది రైతులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వ్యానులో ఎక్కించారు. మహిళలు à°† వ్యాన్‌కు అడ్డుపడబోగా, వారిని లాగివేశారు. వ్యాన్‌ టైర్ల à°•à°¿à°‚à°¦ కూర్చొన్న మహిళలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకొని లాగి, కాళ్లతో పొట్టలో తన్నారు. à°ˆ దాడిలో ముప్పవరపు రమణమ్మ అనే మహిళ చేయి విరిగింది. బ్రహ్మం అనే రైతు గూడ జారింది. ఎర్రమనేని శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడింది. శ్రీలక్ష్మి సంక్రాంతి పండక్కి ఇటీవలే పుట్టింటికి వచ్చింది. గ్రామంలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొన్న ఆమెను పోలీసులు కడుపులో కొట్టారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి విజయవాడలోని à°“ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరెస్టు చేసిన రైతులను పోలీసులు తెనాలి, నందివెలుగు స్టేషన్లకు తరలించారు. ఇక... మందడంతోపాటు తుళ్లూరు, వెలగపూడిలో ప్రజలను ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు.
 
వెలగపూడిలో టెంట్‌ వేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ రైతులు రోజంతా ఎండలోనే దీక్ష కొనసాగించారు. à°ˆ గ్రామంలో కొత్తవారు కనపడితే వారి ఐడీ కార్డులను పరిశీలించాకే అనుమతించారు. రైతుల ఆందోళనలను డ్రోన్‌తో చిత్రీకరించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జరిగిన నిరసన కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, గంజి చిరంజీవి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. తాడేపల్లి మండలం ప్రాతూరులో జేఏసీ నేతలు భేటీ అయి.. ఉద్యమ ఉధృతిపై ఆలోచనలు చేశారు. తాడికొండ అడ్డరోడ్డులో దీక్షలు చేస్తున్న రైతులను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. పెదపరిమి గ్రామంలో నిరసనకారులు వేసిన టెంటును తీయించారు. గుంటూరులో జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.