బొత్స నోట.. తన్నుకొచ్చిన నిజం

Published: Saturday January 18, 2020
రాజధానిపై అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యాఖ్యానిస్తూ.. రాజధాని రైతులను గందరగోళపరుస్తున్నారు. ఇదిలా ఉంటే రాజధానిపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యానారాయణను మీడియా ప్రశ్నించగా.. ఎదురు ప్రశ్నలతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధానిపై గతంలో బొత్స మాట్లాడిన మాటలను.. తాజాగా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ట్వీట్ చేస్తూ.. à°ˆ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం అని టైటిల్ పెట్టారు. భూకబ్జాల కోసమే రాజధాని మార్పు చేస్తున్నారన్న విషయాన్ని బొత్స స్వయంగా ఒప్పుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. 
 
 
ప్రతిపక్ష నాయకుడిగా బొత్స మాట్లాడుతూ.. రాజధాని అక్కడే ఉంటుంది.. అక్కడే ఉండాలి కూడా.. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. మేమంతా కోరేది కూడా అదే. ఎవరైతే భూకబ్జాలు చేస్తారో.. వాళ్లకు కావాలి రాజధాని మార్పు అని వ్యాఖ్యానించారు. నిన్న మాత్రం ఆ మాటలకు ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడారు. రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలి సార్.. అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఐదేళ్ల పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అడ్రస్ లేకుండా.. నోటిఫికేషన్ లేనప్పుడు.. ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారా అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. మూడు రాజధానులు తామనలేదని.. వాళ్లు చేసిన రికమెండేషన్ అని అన్నారు.