గవర్నర్‌ ఎదుట రాజధాని మహిళల కన్నీరు

Published: Sunday January 19, 2020
 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ అమరావతిని తరలించొద్దంటూ ఆందోళన చేస్తున్న మహిళలు... శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ‘రాజధానిని అభివృద్ధి చేస్తామంటే అప్పట్లో మా భూములిచ్చాం. మేము చంద్రబాబుకు కాదు... ప్రభుత్వానికి అప్పగించాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి మాకు నిద్ర లేదు. పిల్లాపాపలతో నడిరోడ్డుపై ఉంటున్నా జగన్‌ కనికరించడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని వివరించి తమకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వెళ్తున్న మహిళలపై ఇటీవల పోలీసులు లాఠీచార్జీ చేసిన ఫొటోలు, వీడియోలను గవర్నర్‌కు చూపించి పలువరు మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
 
 
‘ప్రభుత్వ నిర్ణయం కారణంగా నెల రోజుల్లో 16 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. న్యాయం కోసం రోడ్లపైకి వచ్చిన మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నా మో... రాచరికంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా నిరసనలు చేస్తుంటే అవసరం లేని 144 సెక్షన్‌ విఽధించింది. పోలీసుల తీరుపై డీజీపీకి వివరించినా చర్యలు తీసుకోలేదు. à°ˆ డీజీపీని సస్పెండ్‌ చేయండి’ అని వారు అభ్యర్థించారు. అనంతరం గవర్నర్‌ స్పందిస్తూ.. దీనిపై తన పరిధిలో ఉన్నంత వరకూ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.