శాసన మండలిలో రోజంతా హైటెన్షన్‌

Published: Thursday January 23, 2020
మండలి చైర్మన్‌ అనే మర్యాద కనిపించలేదు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడనీ చూడలేదు. శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌పై వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు బూతులతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ షరీఫ్‌ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే శాసనమండలిలో చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయి.
 
చైర్మన్‌ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒకమంత్రి సైగ చేయగానే... వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ చైర్మన్‌ వద్దకు వెళ్లి ఆయన చదువుతున్న పేపర్లను ము క్కలు ముక్కలుగా చించారు. మరో వైపు నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చైర్మన్‌ సీటు వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. ఈలోపు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని టేబుల్‌ పైకి ఎక్కి చైర్మన్‌ ముందు à°‰ న్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు.
 
బల్లపై ఉన్న శాసన మం డలి ప్రొసీడింగ్స్‌ పత్రాలను మంత్రి కొడాలి నాని వెనక్కు విసిరేశారు. మంత్రులు మోపిదేవి, బొత్స, పెద్దిరెడ్డి చైర్మన్‌ ముందు నిలబడి వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న, నాగ జగదీశ్వర్‌, దీపక్‌రెడ్డి తదితరులు చైర్మన్‌కు రక్షణ వలయంగా నిలబడే ప్ర యత్నం చేశారు. à°ˆ సందర్భంగా వారికీ, వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపటి తర్వాత టీడీపీ సభ్యులు చైర్మన్‌ను క్షేమంగా ఆయన చాంబర్‌లోకి పంపించారు. à°† తర్వాత కూడా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. పలువురు వైసీపీ సభ్యులు చైర్మన్‌ను ఆయన పరోక్షంలో పచ్చి బూతులు తిట్టారు.
 
‘ఒరేయ్‌... తరేయ్‌’ అంటూ రాయడానికి వీల్లేని పదాలనూ ప్రయోగించారు. ఎంఏ షరీఫ్‌ మతాన్ని కూడా ప్రస్తావిస్తూ దూషించారు. చైర్మన్‌ను తిడుతున్న దృశ్యాలను నారా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా... à°’à°• మంత్రి ఆయన వద్దకు వచ్చారు. లోకేశ్‌ చేతిలో ఫోన్‌ లాక్కోడానికి ప్రయత్నించారు. మరో ఇద్దరు మంత్రులూ వచ్చి లోకేశ్‌ను చుట్టుముట్టి, ఫోన్‌ లాక్కోవాలని చూశారు. à°ˆ సందర్భంగా ఆయనను కొట్టినంత పని చేశారు. యనమల రామకృష్ణుడుతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలు రక్షణగా రావడంతో... లోకేశ్‌ అక్కడి నుంచి బయటపడ్డారు. సందర్భకుల గ్యాలరీలో ఉన్న శ్రీకాళహసి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మండలిలో ఉన్న టీడీపీ సభ్యులను బూతులు తిట్టడం కనిపించింది.