వైసీపీ మూడు రాజధానులకు, కేంద్రానికి సంబంధం లేదు

Published: Thursday January 23, 2020
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. ఇందులో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదని ఆయన తెలిపారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేనాని హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. మూడు రాజధానుల అంశం తమ వద్దకు రాలేదని ఏపీ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దియోధర్ కూడా తెలిపారు.
 
 
ఇదిలా ఉంటే.. పవన్‌కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లే ముందు రాజధాని గ్రామాల రైతులను కలుసుకున్నారు. ప్రజా రాజధాని కోసం నాడు భూములిచ్చామని.. నేడు తమను అన్యాయం చేస్తున్నారని మహిళా రైతులు జనసేనాని ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధాని రైతుల ఆవేదనను విన్న పవన్ à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని.. కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీలో రాజధానిపై వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని పవన్ వివరించినట్లు తెలిసింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.