త్వరలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు రెట్టింపు

Published: Sunday June 07, 2020

రాష్ట్రంలో 70 శాతం కరోనా కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదవుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రైమరీ, సెకండరీ సర్వేలెన్స్‌, మానిటరింగ్‌ బృందాలు సమర్థంగా పని చేసేలా చూడాలని ఆదేశించారు. ప్రతివార్డు సచివాలయాన్ని à°’à°• పట్టణ ఆరోగ్యకేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్బన్‌  హెల్త్‌ కేంద్రాలను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ, కర్నూలు వంటి ముఖ్య నగరాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, ఆయా పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హోం క్వారంటైన్‌ , హోం ఐసోలేషన్‌  సక్రమంగా పాటి స్తుందీలేందీ నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.