బస్సులున్నా ఊపందుకోని ప్రయాణాలు

Published: Monday June 08, 2020

లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. కరోనా భయం మాత్రం వీడలేదు. ప్రజారవాణా అందుబాటులోకి వచ్చినా.. మునుపటిలా జనం బయటికి వెళ్లడంలేదు. సొంత వాహనాలపై మొగ్గుచూపుతున్నవారూ ఎక్కువే. కారణం కరోనా సోకిన ఏ ఒక్కరు బస్సు ఎక్కినా.. మనకూ అంటుకుంటుందన్న భయం!!. à°ˆ పరిస్థితి ఆర్టీసీకి గుదిబండగా మారింది. రెండు నెలల లాక్‌ డౌన్‌ తర్వాత à°—à°¤ నెల 21నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రజలకు కొరతలేకుండా పీటీడీ బస్సుల సంఖ్య పెంచుతున్నా స్పందన బోటాబోటీగానే ఉంది. రెండువారాలకు పైగా బస్సులు తిరుగుతున్నా ఆక్యుపెన్సీ 49శాతానికి పడిపోయింది. సామాజిక దూరం పాటించే క్రమంలో 40శాతం సీట్లు తగ్గించినా ఆర్టీసీ చరిత్రలోనే ఇంతటి దుస్థితి ఎన్నడూ లేదు. సాధారణ రోజుల్లో 70శాతానికి పైగా ఉండే ప్రయాణికుల సంఖ్య వేసవి సెలవుల్లో 80శాతానికి పైగా ఉంటుంది. కానీ పరిస్థితి తారుమారైంది. నాలుగు రోజుల క్రితం గుంటూరు నుంచి నరసరావుపేటకు à°’à°• బస్సు కొందరు ప్రయాణికులతో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఒక్కరితోనే తిరిగొచ్చింది. వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో à°’à°• వీడియో వైరలవుతోంది. ‘చూడండి నా స్థాయి.. నా ఒక్కడి కోసమే బస్సు వేశారు’.. అంటూ à°“ ప్రయాణికుడు ఒక్కడే కూర్చున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అది కుప్పం-తిరుపతి బస్సుగా పీటీడీ అధికారులు తేల్చారు