కరోనా గుప్పిట్లో సిక్కోలు

Published: Wednesday June 17, 2020

రాష్ట్రం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. మంగళవారం ఒక్కరోజే 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,720à°•à°¿ చేరింది. మంగళవారం చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88à°•à°¿ చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 88మందికి పాజిటివ్‌ వచ్చింది. కృష్ణాజిల్లాలో మరో 42మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది.

 

దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1022à°•à°¿ చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మరో 41కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాలో 28మందికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 56చొప్పున, తూర్పుగోదావరిలో 16, నెల్లూరులో 5కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఐదుగురికి, విశాఖలో 10మందికి కరోనా సోకింది. ప్రకాశం జిల్లా చీరాలలో à°“ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పదిమంది సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. à°•à°¡à°ª జిల్లాలో 21కేసులు నమోదయ్యాయి. కాగా, సచివాలయంలో న్యాయశాఖలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి వ్యాధి సంక్రమించింది. 

 

న్యూఢిల్లీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): à°•à±‡à°¸à±à°² ఉధృతి.. మరణాల పరంపర కొనసాగుతుండగా.. వాటినుంచి ఊరటనిస్తూ దేశంలో ఒక్కరోజే అత్యధికంగా 10,215మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి శాతం 52.47కు పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో 10,667 కేసులు నమోదయ్యాయని 380మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 9,900 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 8à°µ స్థానానికి చేరింది. కొత్త మరణాల్లో 178 మహారాష్ట్రలోనే సంభవించాయి. దేశంలో మృతుల సంఖ్య పది వేలకు చేరింది. నవంబరు నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుతుందని తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈమేరకు సంస్థ బెంగళూరులో మంగళవారం à°“ ప్రకటన విడుదల చేసింది. కాగా, పాకిస్థాన్‌తో యుద్ధంలో సైన్యాన్ని నడిపించి.. 27 పాక్‌ యుద్ధట్యాంకులను ధ్వంసం చేసిన యోధుడు.. మహావీర్‌ చక్రతో దేశం గౌరవించుకున్న లెఫ్టెనెంట్‌ జనరల్‌ రాజ్‌ మోహన్‌ వోహ్రా(88) కరోనాతో మృతిచెందారు.