కోవిడ్‌కు విరుగుడు కనుగొన్న హెటిరో

Published: Sunday June 21, 2020

 à°•à°°à±‹à°¨à°¾à°•à± మందు సిద్థం చేశామని ప్రముఖ  జెనిరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో ప్రకటించింది. కోవిడ్ అనుమానితులు, పాజిటివ్ రోగులు గుర్తించ‌à°¬‌à°¡à°¿à°¨ చిన్నారులు, యువత కోవిడ్ à°²‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాలైన వారి కోసం  కోవిఫ‌ర్ అనే మెడిసిన్ సిద్ధమైందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బి.పార్థ‌సార‌థి రెడ్డి తెలిపారు. రెమ్డిసివిర్‌ అనే పేరుతో తయారు చేసినా.. `కోవిఫర్‌` అనే పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. 100 మిల్లీగ్రాముల à°µ‌à°¯‌ల్ (ఇంజెక్ష‌న్‌) రూపంలో అందుబాటులో ఉంటుందన్నారు. ఉత్ప‌త్తి, మార్కెటింగ్ కోసం డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌à°°‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి కూడా పొందిన‌ట్లు వెల్ల‌డించింది. గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీతో కుదుర్చుకున్న‌ లైసెన్స్ ఒప్పందాన్ని అనుస‌à°°à°¿à°‚à°šà°¿ à°ˆ ఉత్ప‌త్తిని అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామని ఆయన అన్నారు. 

 

భారత ఫార్మా దిగ్గజం, ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ సంస్థ కూడా కరోనాను నయం చేసేందుకు ట్యాబ్లెట్లు తయారు చేసిన విషయం తెలిసిందే. యాంటివైరల్‌ డ్రగ్‌ ఫవిపిరవిర్‌ను ఫ్యాబిఫ్లూ పేరుతో శనివారం ఆవిష్కరించింది. ఫ్యాబీఫ్లూ మాత్రల తయారీ, మార్కెటింగ్‌ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి ఇప్పటికే తమకు అనుమతులు లభించినట్లు గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది. భారత్‌లో కొవిడ్‌ చికిత్సలో మాత్రలకు అనుమతులు పొందిన తొలి సంస్థ గ్లెన్‌మార్క్‌ కావడం విశేషం. శనివారం à°“ ప్రకటనలో సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొవిడ్‌-19 స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న రోగులపై ఫ్యాబిఫ్లూ మాత్రలు బాగా పనిచేస్తాయి.