లాడెన్ ‘అమర వీరుడు’ అంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Published: Thursday June 25, 2020

పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒసామా బిన్‌లాడెన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులకు సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌ను ‘అమర వీరుడు’ తో పోలుస్తూ ప్రసంగించారు. ‘అమెరికా దళాలు అబోటాబాద్ వచ్చి ఒసామా బిన్‌లాడెన్‌ను చంపినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఆయన అమర వీరుడు’ అంటూ ప్రసంగంలో పేర్కొన్నారు.

 

ప్రధాని ఇమ్రాన్ 9/11 దాడులకు ప్రధాన సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌ను అమరవీరుడంటూ పోల్చడం ఇదేమీ ప్రథమం కాదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు కూడా à°“ టీవీ ఛానళ్లలో మాట్లాడుతూ బిన్‌లాడెన్ ఉగ్రవాది అంటే నేను ఒప్పుకోను అని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. బ్రిటిష్ వారికి మాత్రమే లాడెన్ ఉగ్రవాది అని, మిగితా వారికి మాత్రం ఆయన స్వాతంత్ర్య సమర యోధుడే అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

 

అయితే గతేడాదిలో ఆయన అమెరికాలో పర్యటిస్తూ... బిన్‌లాడెన్ అబోటాబాద్‌లో తలదాల్చుకున్నట్టు తామే అమెరికాకు చెప్పినట్లు ఆయన గతంలో ప్రకటించారు. అయితే లాడెన్‌ను చంపడానికి రహస్య ఆపరేషన్ చేయకూడదని కూడా ఇమ్రాన్ అమెరికాకు తేల్చి చెప్పారు.