సామాజిక మాధ్యమాల ద్వారా బలైన ఒక అమాయకుడు

Published: Sunday May 20, 2018

బాధితుడు మానసిక రోగి à°¸à°¾à°®à°¾à°œà°¿à°• మాధ్యమాల ప్రభావంతో గ్రామస్థుల్లో భయాందోళనలు à°…చ్యుతాపురం: దొంగల ముఠాలు, నరహంతకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం జరుగుతుండటంతో పల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం అనుమానితులు గ్రామాల్లో కనిపించినా వారిపై దాడి చేస్తున్నారు. మండలంలో ఆవసోమవరం పరిధిలో శనివారం ఇటువంటి సంఘటనే జరిగింది.

మహిళా దుస్తులు వేసుకొని మానసిక రోగిలా కనిపించిన వ్యక్తిని కొందరు పట్టుకొని దాడిచేశారు. తీవ్రంగా గాయపరిచి స్థానిక పోలీసులకు అప్పగించారు. à°† వ్యక్తిని ముందురోజే స్థానిక పోలీసులు పట్టుకొని విచారించి మానసిక రోగి అని తెలుసుకొని విడిచిపెట్టారు. ఇతన్నే మళ్లీ ఆవసోమవరంలో పట్టుకొని కొట్టడంతో పోలీసులు అనకాపల్లి రైల్వేస్టేషన్‌à°•à°¿ తీసుకెళ్లి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక ఎస్సై దీనబంధు తెలిపారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప ప్రజలే నేరుగా దాడులకు దిగడం సరికాదని ఎస్సై తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠా దిగిందనే ప్రచారం నమ్మవద్దని, ఇటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే తామే ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన గుర్తుచేశారు. సామాజిక మాధ్యమంలో వచ్చేవన్నీ నిజాలు కాదనే విషయం గ్రహించాలన్నారు.