ఆన్‌లైన్‌ బోధనతో అనర్థాలే

Published: Sunday July 05, 2020

కొవిడ్-19 మానవాళి జీవనంపైన వేసిన విభిన్న ప్రభావాలలో విద్యారంగం కూడా బాగా నష్టపోయినవాటిలో à°’à°•à°Ÿà°¿. విద్యా సంవత్సరం బాగా చికాకు పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. విద్యారంగంలో ఎక్కువగా నష్టపోయేది పాఠశాల విద్యే. పాఠశాల విద్యలో అంతర్జాల తరగతులు నిర్వహించి విద్యాబోధన చేయడంలో ఉండే సౌకర్యాలు ఏమిటి నష్టాలు ఏమిటి అని ఆలోచించి వివేచించడానికి ఉద్దేశించింది à°ˆ వ్యాసం. UNESCO, UNICEF వంటి అంతర్జాతీయ సంస్థలు పాఠశాల విద్యలో ఆన్‌లైన్ బోధన వల్ల వచ్చే సాధకబాధకాలను అధ్యయనం చేసి దీనితో వచ్చే నష్టాల పట్ల తీవ్రంగా హెచ్చరికలు చేసాయి. 

 

ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో ఆన్‌లైన్ తరగతుల హడావిడి మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మెయిల్ సందేశాలు పంపడం పదివేలు కట్టి పాస్ వర్డ్‌ తీసుకోండి అని చెప్పడం చేస్తున్నారని వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. కార్పొరేటు విద్యారంగానికి, ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యానికి విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతున్నారనే ఆలోచనకన్నా తమ ఆదాయానికి పెద్దఎత్తున à°—à°‚à°¡à°¿ పడింది అనే బాధే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కరోనా కారణంగా మూతబడిన కాలానికి ప్రభుత్వాలు ఏమి నిర్దేశించినా రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేయడం వారు ఆపలేదు. ప్రైవేటు స్కూళ్ళ ఆగడాలు ఇప్పుడు కొత్త కాదు. కానీ కరోనా అడ్డుపడుతున్నా సంపాదించే దృష్ట్యా చిన్న పిల్లల జీవితాలతో ప్రయోగాలు చేసే à°ˆ ధోరణిని ప్రభుత్వాలు తప్పనిసరిగా అడ్డుకొని ఆపవలసి ఉంది. 

 

ప్రైవేటు యాజమాన్యం à°’à°• పాఠశాల విద్యార్థులకు కాని వారికి ఉన్న అన్ని స్కూళ్ళలోను విద్యార్థులకు కాని ఒకే చోటునుండి పాఠాలు ఆన్‌లైన్‌లో అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. à°ˆ పాఠాలను ఏ సమయంలో ఉండేది ఇంటికి మెయిల్ కాని మెసేజ్ లు కాని పంపిస్తారు. à°† సమయానికి విద్యార్థి తన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్, ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్ లలో దేనినైనా దగ్గర పెట్టుకొని ఇంటర్‌నెట్‌à°•à°¿ కనెక్టు కావాలి. యూట్యూబ్‌లో కాని లేదా పాఠశాల వారు అందించిన యాప్‌ ద్వారా కాని పాఠాలు చూడాలి వినాలి. ఇక్కడ విద్యార్థి దృష్టి కేవలం తన ముందున్న చిన్న తెరపైనే ఉంటుంది. ల్యాప్‌ టాప్ తెరే చాలా చిన్నది అని అనుకుంటే ఇక ట్యాబ్‌లలో కాని లేదా స్మార్ట్‌ఫోన్లలో కాని పాఠాలు చూడడం పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మెదడుపైన చాలా ఒత్తిడి పడుతుంది, à°•à°‚à°Ÿà°¿ పైన చాలా శ్రమ పడుతుంది. ఇది à°’à°• à°°à°•à°‚à°—à°¾ ఆరోగ్యసమస్యకు దారి తీస్తుంది. అంతే కాదు విద్యార్థికి కొన్ని à°—à°‚à°Ÿà°² పాటు à°† చిన్న తెర ఎదురుగా ఉండి పాఠాలు వినడం అంటే పెద్ద శిక్షే అవుతుంది. సజీవమైన తరగతి గదికి, సజీవమైన ఉపాధ్యాయుని బోధనకు ఆన్‌లైన్ తరగతులు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావు. అధ్యాపకుని à°…à°¡à°¿à°—à°¿ ఏదైనా తెలుసుకునే అవకాశం విద్యార్థికి ఉండనే ఉండదు. విద్యార్థికి ఉండే సామాజిక జీవితం, దైనందిన జీవన క్రమం (social life and process) కోల్పోతాడు. à°ˆ స్థితి తప్పనిసరిగా కొవిడ్ వల్ల ఏర్పడినప్పుడు కోల్పోయిన సామాజిక జీవితానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కాని ఆన్‌లైన్ విద్య విద్యార్థిని మరింత ఒంటరిని (isolate) చేస్తుంది. ఇది మరింత నష్టం అని యునెస్కో హెచ్చరించింది.