ఏపీలో కరోనా తీవ్రరూపం..

Published: Wednesday July 15, 2020

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2,412 మందికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో.. 2500కు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

 

à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల్లో.. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. గుంటూరు తర్వాత కర్నూలు జిల్లాలో 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి 207, తూర్పు గోదావరి 247, చిత్తూరు 257, శ్రీకాకుళం 178, అనంతపురం 162, విశాఖపట్నం 123, à°•à°¡à°ª 112, కృష్ణా 108, ప్రకాశం 53, విజయనగరం 49,  నెల్లూరు జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా, 2,412 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

ఏపీలో కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒకరు మరణించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.