వ్యక్తి గొంతు కోసిన కేసును ఛేదించిన పోలీసులు

Published: Thursday July 16, 2020

 à°®à°‚డలంలోని వెంకటాపూర్‌ గేటు సమీపంలోని పడకల్‌ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కడావత్‌ రాజు అనే వ్యక్తి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి భార్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే ఘటనకు కారణంగా పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, సీఐ నర్సింహారెడ్డి, ఎస్సై వరప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

 

ఫారూక్‌నగర్‌ మండలం వెంకన్నగూడకు చెందిన కడావత్‌ రాజు భార్య శాంతి, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌ బండ్లగూడలోని à°“ ఫంక్షన్‌హాల్‌ యజమాని యూసుఫ్‌ అనే వ్యక్తి వద్ద పనిచేస్తూ అక్కడే à°“ గదిలో నివసించేవారు. à°ˆ క్రమంలో యూసుఫ్‌ శాంతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తను అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన సోదరుడు శ్రీను, యూసుఫ్‌, అతని స్నేహితుడు జహీర్‌ సహాయంతో రాజును à°ˆ నెల 10à°¨ పడకల్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. పధకం ప్రకారం రాజు గొంతు కోసి చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. చనిపోతానేమోననే భయంతో రాజు తన చేతిపై ఫోన్‌ నెంబర్లు రాశాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బండ్లగూడలో శాంతి, శ్రీను, యూసుఫ్‌, జహీర్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వరప్రసాద్‌ పేర్కొన్నారు.