ఏపీ పరిపాలనా రాజధాని మళ్లీ మారబోతుందా?

Published: Wednesday July 22, 2020

ఏపీ పరిపాలనా రాజధాని మళ్లీ మారబోతుందా? విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు వేసిందా? రహస్యంగా కాంట్రాక్టులు అప్పగించడం వెనుక ఏం జరుగుతోంది? à°ˆ పరిణామాలన్నింటిని చూస్తే.. రాజధాని మార్పు ఖాయమనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాజధాని అమరావతిని విశాఖకు తరలించాలని జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్‌à°—à°¾ ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. రేపో.. మాపో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. à°ˆ నేపథ్యంలో రాజధాని విశాఖలో కాకుండా విజయనగరం జిల్లా భోగాపురం తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా భోగాపురంలో ఏపీ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాలను రాజధాని కొరకు ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది. 500 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను  ఖరారు చేసింది. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు ప్రణాళికల కాంట్రాక్ట్‌ను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది. ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దక్కించుకున్న వారికే ఏపీ పరిపాలన రాజధానిని అప్పగించింది. హెచ్‌సీపీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగిస్తూ మూడు వారాల క్రితం రహస్యంగా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించిన స్థలంలో 500 ఎకరాలను ప్రభుత్వం తమ వద్దే ఉంచుకుంది. ఇప్పుడు à°† స్థలాన్నే హెచ్‌సీపీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది.

 

ఈ మార్పు వెనుక విశాఖలో ఇటీవల చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటన, వరుస అగ్నిప్రమాదాలు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు విశాఖ అనువుకాదని ప్రచారం చేయడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.