2 నెలల బాలుడిని పట్టించుకోని వైద్యులు

Published: Thursday July 30, 2020

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అంటూ గూడ అంజన్న ఎప్పుడో రాసిన à°ˆ పాట ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు అద్డంపడుతోంది. ఎంతమంది మారినా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోగులు ప్రాణాలంటే వీరికి లెక్కలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రసారమాధ్యమాల ద్వారా వైద్యుల బండారం బయటపడుతున్నప్పటికీ వీళ్లు మాత్రం అట్లానే ఉన్నారని, వీళ్ల నిర్లక్ష్యం వల్ల ఎందరో అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. 

 

జీజీహెచ్‌లో దారుణం జరిగింది. కరోనాతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో రెండు నెలల బాలుడు, తల్లి చేరారు. మూడు రోజులుగా తల్లి, బిడ్డను వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. తనను బిడ్డను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తల్లి సెల్పీ వీడియోలో పంపించింది. గుంటూరు పట్టణానికి చెందిన మహిళ తన బిడ్డ అనారోగ్యంగా ఉండడంతో జీజీహెచ్‌కు వచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్ వైద్యులు నిబంధన పెట్టారు. అయితే తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

ఇద్దరికీ కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. పాజిటివ్ వచ్చినప్పటి నుంచి తమను ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఇద్దరికీ కరోనా రావడంతో వార్డలోకి కూడా వైద్యులు, ఇతర సిబ్బంది ఎవరూ రావడం లేదని ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మూత్రవిసర్జనకు సంబంధించిన మందులను బయట నుంచి తెచ్చుకోవాలని వైద్యులు చెప్పారని, మందులు తెచ్చుకున్నప్పటికీ ఇంజక్షన్స్ లోడ్ చేసి ఇవ్వకుండ సిబ్బంది వెళ్లిపోయిందని ఆమె చెబుతోంది. ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది ఇంజక్షన్స్ చేయడం లేదంటుని తల్లి సెల్ఫీ వీడియోలో వాపోయింది. తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి వేడుకుంది.