రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం

Published: Friday July 31, 2020

ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. అంతేకాదు, సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన ఆమోదించారు. దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది