న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం..

Published: Friday August 07, 2020

అధికార పార్టీ విధానాలను నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటిది ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదన్నారు. ఇక రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారన్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అమరావతి నిర్మాణానికి à°Žà°‚à°¤ ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

 

న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం కల్గుతుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదన్నారు. తనను కూడా చాలాసార్లు బెదిరించారని గుర్తుచేశారు.